Suryaa.co.in

Andhra Pradesh

వయసు పదహారు..అందుకే పింఛను నిలిపేశారట!

ఉరవకొండ: ఆధార్ కార్డులో దొర్లిన చిన్న తప్పు ఓ వృద్ధురాలి పింఛను పోయేలా చేసింది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని గాంధీ చౌక్ వీధిలో నివసిస్తున్న షేక్ అమీనాబీ గత 20 ఏళ్లుగా పింఛను పొందుతున్నారు. జులై నుంచి పింఛను నిలిపేయటంతో కంగారు పడిన ఆమె.. కారణాలు తెలుసుకునేందుకు అధికారుల చుట్టూ తిరిగారు. ఆధార్ కార్డులో ఆమె వయసు 16 ఏళ్లని ఉండటంతో పింఛను నిలిచిపోయిందని అధికారులు చెప్పిన సమాధానంతో ఆమె కంగుతిన్నారు. మూడేళ్లకు మించి వయసులో మార్పులు చేయాల్సి ఉంటే ప్రధాన కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని.. అప్‌డేట్ పూర్తయిన వెంటనే పింఛను ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.

LEAVE A RESPONSE