Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వినర్ అట్లూరి నారాయణ రావు ఆధ్వర్యంలో పాట

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుపై ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వినర్ అట్లూరి నారాయణ రావు ఆధ్వర్యంలో తయారు చేసిన పాటను బుధవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో అచ్చెన్నాయుడు రిలీజ్ చేశారు. తెదేపా శాసన సభాపక్షం సమావేశంలో పాటను ఆవిష్కరిస్తూ…. పాట చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుపై ప్రజలకు వాస్తవాలు వివరించేలా ఉందని నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో తెదేపా అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, టిడి జనార్దన్, పంచుమర్తి అనురాధ, షరీష్, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్ గారు, బోండ ఉమామహేశ్వర్, గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, ఉండి రామరాజు, ఉండవల్లి శ్రీదేవి, బీద రవిచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE