– నీతిపరులంటే జగన్ రెడ్డికి ఏహ్యభావం. అందుకే చంద్రబాబు, లోకేశ్ లను తప్పుడు కేసులతో అడ్డుకుంటున్నాడు
• పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన లోకేశ్ కు.. రాజధానిలో వేయని ఇన్నర్ రింగ్ రోడ్డుకి లింక్ పెట్టడం జగన్ రెడ్డి భయానికి నిదర్శనం.
• యువగళం పాదయాత్రతో జగన్ రెడ్డి ప్యాంట్లు తడుపుకుంటున్నాడు
మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి, టీడీపీ యువనేత లోకేశ్ కు సంబంధం ఏమిటని, యువగళం పాదయాత్రకు భయపడి ప్యాంట్లు తడుపుకుంటున్న జగన్ రెడ్డి లోకేశ్ పై తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని కూడా జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ జరగకుండా, ఎక్కడా రోడ్డే వేయకుండా లోకేశ్ ప్రమేయం ఉందని సీఐడీ చెప్పడం ముమ్మాటికీ జగన్ రెడ్డి దుర్మార్గాల్లో భాగమే. ఇన్న ర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అవినీతి జరిగిందని చెప్పడం నిజంగా బుద్ధిలేని తనమే. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన లోకేశ్ కు ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఎలాంటి సంబంధంలేదు.. కనీసం అమలుకుకూడా నోచుకోని ప్రాజెక్ట్ లో తప్పు జరిగిందంటూ సీఐడీ ఎఫ్.ఐ.ఆర్ లో మా యువనేత పేరు చేర్చారంటే జగన్ రెడ్డి ఎంత గా లోకేశ్ కు భయపడుతున్నాడో అర్థమవుతోంది.
చంద్రబాబు… ఆయన కుటుంబం పదేళ్ల నుంచి తమ ఆస్తుల వివరాలు ప్రకటిస్తుంటే, జగన్ రెడ్డి ఒక్క సారి కూడా ఎందుకు ప్రకటించలేదు?
చంద్రబాబు, ఆయన కుటుంబం పదేళ్ల నుంచి ఆస్తులపై ప్రకటన చేస్తోంది. అలా ఏనాడైనా జగన్ రెడ్డి గానీ, ఆయన కుటుంబసభ్యులుగానీ ప్రకటించారా? అలా ప్రకటిం చే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన హెరిటేజ్ పై వచ్చే ఆదాయం అంతా పారదర్శకంగా వస్తున్నదే. అంతకుమించి రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఎక్కడా ఏనాడూ చంద్రబాబు తప్పుచేసింది లేదు.
నీతి నిజాయితీల కు మారుపేరైన చంద్రబాబుని ప్రజలు ఆదరిస్తున్నారన్న అక్కసుతోనే జగన్ రెడ్డి అన్యా యంగా తప్పుడు కేసులతో మా నాయకుడిని జైలుకు పంపాడు. అవినీతి పరులకు నీతివంతులంటే ఏహ్యభావం. అందుకే కావాలనే చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టించి జైలుకు పంపాడు. నీతిపరుడైన చంద్రబాబుని ధైర్యంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే జగన్ రెడ్డి ఇలాంటి తప్పుడు దారుల్లో వెళ్తున్నాడు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి ని ఆపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోవడం కూడా జగన్ రెడ్డి తరం కాదు.
జగన్ రెడ్డి బతుకే బినామీ బతుకు.. తన ఆస్తుల్ని కూడా తనవి కావనే చెప్పుకునే దుస్థితిలో జగన్ ఉన్నాడు
జగన్ రెడ్డి బతుకే బినామీ బతుకు. చంద్రబాబు అయినా, టీడీపీ నేతలమైన తామైనా మాకు ఈ ఆస్తులు ఉన్నాయి… ఈ ఇళ్లు, పొలాలు, భూములున్నాయని గర్వంగా చెప్పుకోగలం. కానీ జగన్ రెడ్డి తనపేరిట ఉన్న ఆస్తుల్ని బినామీలపేరుతో పెట్టి, తన కేమీ లేవంటూ నక్కవినయాలు ప్రదర్శిస్తుంటాడు. సాక్షి పేపర్, టీవీ తనవి కావని చెప్పడం జగన్ రెడ్డి లాంటి అబద్ధాల కోరు, అవినీతిపరుడికే సరిపోయింది. వైసీపీనేతల అవినీతి చిట్టా విప్పితే, వారు జగన్ రెడ్డికి ఏమాత్రం తీసిపోరు.
1.50లక్షల ఎకరాల చుక్కల భూములు కాజేసిన జగన్ రెడ్డి అతని ప్రభుత్వానికి వచ్చు ఎన్నికల్లో రైతులు చుక్కలు చూపిస్తారు
పేదలకు ఇళ్లపట్టాలంటూ సెంటు పట్టాల పేరుతో రూ.7వేలకోట్లు దిగమింగారు. ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలతో ఎక్కడికక్కడ, ఎవరి ఇష్టానుసారం వారు దోచేస్తున్నా రు. చుక్కలభూముల సమస్య పరిష్కారం కూడా జగన్ రెడ్డి, వైసీపీనేతల దోపిడీ కోసమే. చుక్కల భూములు రాష్ట్రంలో దాదాపు 2లక్షల ఎకరాలుంటే, జగన్ రెడ్డి అతని ముఠా లక్షా50వేల ఎకరాలను కాజేశారు.
విలువైన భూముల్ని 22 ఏ జాబితాలో చేర్చి, అర్హులైన భూహక్కుదారుల్ని వేపుకుతింటున్నారు. డబ్బులిస్తే ఆ భూముల్ని 22 ఏ జాబితా నుంచి తప్పించడం చేస్తున్నారు. చుక్కల భూములు సాగు చేసుకుం టున్న రైతులకు జగన్ రెడ్డి సర్కార్ ఇన్నాళ్లు చుక్కలు చూపించింది.. రేపు జరగ బోయే ఎన్నికల్లో ఆ రైతులే జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి చుక్కలు చూపించ డానికి సిద్ధంగా ఉన్నారు.” అని ఆంజనేయులు తేల్చిచెప్పారు.