సైకిల్‌పై గడ్డిమోపుతో ప్రయాణం
ఆ ఆదాయమే ఆమెకు ఆధారం
రైల్వేట్రాక్‌పై సైకిల్ ప్రయాణం
యలమందమ్మ.. నీకు వందనం
70 ఏళ్ల వయస్సులో, రోజూ 4 KM వెళ్లి, గడ్డిమోపు తెచ్చి, అమ్ముకుంటూ జీవనం సాగిస్తుందీ బామ్మ! గుంటూరుకు చెందిన యల్ల మందమ్మ అందరిలా కాదు….70 ఏళ్ల వయస్సులో…. తెల్లవారగానే లేచి, అన్నం వండుకొని, ఇంత తిని, ఇంత సద్ది కట్టుకొని….సైకిలెక్కి ఓ నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి…అక్కడున్న గడ్డికోసి, మోపు కట్టుకొని, సైకిల్ మీద వేసుకొని…మళ్లీ 4 KM వచ్చి…ఊర్లో తిరిగి, ఆ గడ్డిమోపును 100 రూపాయలకు అమ్ముతూ జీవనం సాగిస్తుంది.
కూర్చొని చేసే పనుల్లోనే 56-60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటున్న ఈ రోజుల్లో…70 ఏళ్ల వయసులో కూడా ఇంకా కష్టించే తత్వం మారని ఆ మట్టిమనిషికి నిజంగా శతకోటి వందనాలు. యల్ల మందమ్మ ప్రతి రోజు ప్రయాణించే నాలుగు కిలోమీటర్లలో, దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం సరిగ్గా ఉండదు. ఆ రెండు కిలో మీటర్లు..రైల్వే ట్రాక్ మీద నడవాల్సిందే.
సాధారణంగా రైల్వే ట్రాక్ మీద మనుషులు నడవడమే కష్టం…అలాంటిది…మందమ్మ… 70 ఏళ్ల వయస్సులో సైకిల్ మీద గడ్డిమోపు పెట్టుకొని పోనూ 2 KM, రాను 2KM అదే ట్రాక్ మీద సైకిల్ గడ్డిమోపుతో నడుచుకుంటూ వస్తుంది. నాలుగేళ్లుగా ఇలా చేస్తూ తాను సంపాదించిన డబ్బుతో జీవనం సాగిస్తుంది మందమ్మ. నిత్య యవ్వనంలో ఉండి సోమరులుగా తయారవుతున్న యువకులకు, అన్ని అవయవాలు సరిగ్గా ఉండి బిఛ్చమెత్తుకుంటున్న చేతకాని వాళ్లకు….యల్ల మందమ్మ జీవితమే ఓ ఆదర్శ పాఠం. అమ్మా.. నీకు వందనం!
సేకరణ..
– కంకణాల శ్రీనివాసరావు