Suryaa.co.in

National

మౌన మునికి కన్నీటి వీడ్కోలు

– నిగమ్ బోధ్ ఘాట్‌లో ముగిసిన అంత్యక్రియలు
– పాడె మోసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక వేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి.ఢిల్లీ లోని నిగమ్ బోధ్ ఘాట్‌లో శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో మౌన మునికి అంతిమ వీడ్కోలు పలికారు.ఏఐసీసీ కార్యాలయం నుంచి సాగిన అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాడె మోశారు. అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ.. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరై తుది వీడ్కోలు పలికారు.

LEAVE A RESPONSE