Suryaa.co.in

Features

విశ్వమంతా తెలిసిన విలువైన నేత

వినోదరాయునిపాలెం
విలువైన విజ్ఞాన వైవిధ్యం గల
విశ్వమంతా తెలిసిన నేత
వారే టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు
మద్రాసు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా పనిచేసిన
మహానుభావులు. సహృదయం గలవారు.

టంగుటూరు వారంటేనే
టంకంలాంటి వారు
చురుకుతనం
చిలిపితనం కలవారు
టంగుటూరి ప్రకాశం పంతులు గారు

మహా పెద్ద కుటుంబం
మన ప్రకాశం పంతులు గారిది
మారాం చేసేవారు
బడికి వెళ్లాలంటే
టంగుటూరి ప్రకాశం పంతులు గారు

మన పంతులు గారికి
నాటకాలు ఆటలన్నా
మహా ఇష్టం
ఆ పద్దతులలోనే నేర్పే
విద్యను గురువుగారు
హనుమంతనాయుడు
టంగుటూరి ప్రకాశం పంతులు గారికి

హనుమంతనాయుడు అనే
పంతులుగారుచే అబ్బే చదువు
అలా చదువులు సాగే
టంగుటూరి ప్రకాశం పంతులు గారి చదువులు

నాన్నగారి మరణంతో
అద్దంకి, నాయుడుపేట,
ఒంగోలు, రాజమండ్రి ,వినోదరాయునిపాలెం
ఇలా జరిగే ప్రకాశం పంతులుగారి ప్రయాణం

గాంధీగారు ప్రకాశంపంతులుగారు కలసి చేసిన ఉప్పు సత్యాగ్రహం చేసిన స్తూపం
నేటికీ దేవరంపాడులో ఉండే
నేటికీ వినోదరాయుని పాలెంలో ఇల్లు ఉండే

రాజమండ్రిలో
వారి గురువులు వద్ద ఉండి
చదువులు చదివి
ప్రయోజకులుగా అయ్యే

నీతి నిజాయితి
దానశీలుడు
అపర మేధావి
అందరిలో కలసి మెలసి ఉండేవారు
టంగుటూరి ప్రకాశం పంతులు గారు

నాటకాలు ఆడుట
న్యాయవాదిగా
మున్సిపల్ ఛైర్మన్ గా
మద్రాసు ముఖ్యమంత్రిగా
ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా
పనిచేసినవారు
టంగుటూరి ప్రకాశం పంతులు గారు

ఏ పదవి చేసినను
అనగా రాజమండ్రి చైర్మన్ గా
మద్రాసు ముఖ్యమంత్రిగా
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా
కేవలం 11నెలలు మాత్రమే పనిచేసే
టంగుటూరు ప్రకాశం పంతులు గారు

గాంధీ గారి పరిచయంతో
స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొని
ఉప్పు సత్యాగ్రహం
క్విట్ ఇండియా ఉద్యమం
ఇలా అనేక ఉద్యమాలతో
జైలు జీవితం గడిపే
టంగుటూరు ప్రకాశం పంతులు గారు

ఇంగ్లీషు వారికి
రండి కాల్చండి
అని రొమ్ము చూపిన వారు
అల ఆంధ్రకేసరి పేరు తెచ్చుకునే
ధైర్యవంతులు
టంగుటూరి ప్రకాశం పంతులు గారు

వీరు తమిళ్ హిందీ తెలుగు
దిన పత్రికలు నడిపి
ప్రజలను చైతన్య పరిచి
ప్రజలకు అన్ని విషయాలు తెలిపే
టంగుటూరి ప్రకాశం పంతులు గారు

వీరు పేదరికాన్ని
ప్రేమించేవారు
సంపాదించి అంతా
దానం చేసారు
టంగుటూరి ప్రకాశం పంతులు గారు

చరిత్రలోనే చూడలేము
ఇలాంటి గొప్ప దేశ భక్తుడను
ఉంటే ఇవ్వడమే తెలుసు

-ఇడపలపాటి సత్య నారాయణ
రిటైర్డ్ హెడ్మాష్టారు
ఒంగోలు 9948669975

LEAVE A RESPONSE