ప్రముఖ గజల్, సినిమా గాయకుడు హరిహరన్. ఆయన తన FB పేజ్ లో నిన్న కేరళలో జరిగిన ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ సందర్భం, సంఘటన గురించి చెబుతూ బాలు గురించి ఇలా రాశారు:
“ఒక గాత్రం అది తరాలను, భాషలను, ఎల్లలను అధిగమించింది; ఇప్పుడు ఆ గాత్రం భవిష్యత్ తరాల కళాకారులకు స్ఫూర్తినిస్తూండే చోటులో స్మరించుకోబడింది”
అంతేకాదు
“ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం వారసత్వం నెలకొని ఉంటుంది” అనీ హరిహరన్ ప్రకటించారు.
A tribute to a voice that transcended generations, languages, and boundaries, now remembered in a space that will continue to inspire countless artists to come.
#SPBalasubrahmanyam #SPB #LegacyLivesOn
ఎస్.పీ.బీ. ఇప్పుడు భౌతికంగా లేరు; ఇలాంటి మాటల్ని ఏదో సభా మర్యాద కోసమో, సభ్యత కోసమో హరిహరన్ అనక్కర్లేదు. హరిహరన్ తన టైమ్ లైన్ లో తన మాటను బహిరంగంగా రాసుకుని ఒక సంగీతజ్ఞుడిగా బాలు గురించి సరైన నిజాన్ని ఆవిష్కరించారు. అది తెలుగువాళ్లకు ఎప్పటికైనా అవగతం అవుతుందా?
హరిహరన్ శాస్త్రీయ సంగీతం అభ్యసించిన వారు; హిందూస్తానీ సంగీతం అవగాహన ఉన్నవారు; గజల్ గాయకుడు. గజల్ పాడడం అంటేనే ‘గానకళ ఉదాత్తత’ అనే. (ఘంటసాలకు గజల్ గానం అర్థం కాలేదు; నచ్చలేదు) ఆ హరిహరన్ బాలు గురించి అన్న ఈ మాటలు తెలుగు మధ్యతరగతి మాంద్యాన్ని వదలగొడతాయా?
‘Vocal power’ అంటూ బాలును హరిహరన్ కొన్ని దశాబ్దుల క్రితమే బహిరంగంగా ప్రకటించారు. మన తెలుగు మేధావులకు ఇంకెన్ని దశాబ్దుల తరువాత ఈ మాటలు అర్థం అవుతాయి?
ఘంటసాల కాదు రానున్న తరాల దక్షిణాది భాషల గాయకులకు బాలు ఒక సరైన స్ఫూర్తిగా ఉంటారు. ఎప్పటికీ దక్షిణాదిలో మేలైన గానం పీ.బీ. శ్రీనివాస్& ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలోనే సాగుతుంది.
బాలు గురించి హరిహరన్ చెప్పిన మాటలు మన తెలుగుల కళ్లు తెరిపిస్తాయా? లేకపోతే ఈ నిజం చెప్పినందుకు తెలుగు మానసిక రోగం హరిహరన్ పై దాడి చేస్తుందా? ఈ వరకే ఘంటసాల అభిమానులు అన్న మానసిక రోగులు బాలమురళీకృష్ణపై దాడి చేశారు.
అభిప్రాయాలకు, అనుకోవడానికి, అభిరుచులకు, అజ్ఞానానికి అతీతంగా సాకేతికంగా, నైపుణ్యం ప్రాతిపదికగా, ప్రతిభ పరంగా ‘ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల కన్నా ఎంతో గొప్ప గాయకుడు’. ఈ విషయం బయటి ప్రపంచానికి బాగా తెలుసు! మన తెలుగుకు ఎప్పటికైనా తెలుస్తుందా?

– రోచిష్మాన్
9444012279