-మానవతా హృదయంతో స్పందించిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్
-క్యాన్సర్ బాధితురాలికి రూ.3 లక్షల సహాయం
– సాయంత్రం కల్లా బాధితురాలికి చెక్కు అందజేత
జిల్లాల్లో చేపట్టిన పర్యటనల సందర్భంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తమ కుటుంబ దీనస్థితిని విన్నవించుకొన్న ఎందరో అభాగ్యులకు ఉదారంగా సహాయం అందించి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విజయనగరం జిల్లా మెంటాడ మండల పర్యటన సందర్భంగా మానవతా హృదయంతో మరో మహిళకు ఆర్ధిక సహాయం అందించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం బిల్లలవలస పంచాయతీ కొండదాడి గ్రామానికి చెందిన కన్నూరు సరస్వతి(34)ది ఒక విషాదగాథ. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్ వ్యాధితోనే మృతి చెందారు. ఆమెకు తన అనుకునే తోబుట్టువులు ఎవరూ లేరు. పైగా గత ఐదేళ్లుగా గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతోంది.