గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు
నేటి నుంచి 24వ తేదీ వరకు అవకాశం
రెండో విడతగా ఫిబ్రవరి 7 నుంచి 10 వరకూ
పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు దొర్లితే నేటి నుంచి అప్‌డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.జనవరి 19, 20, 21, 23, 24 తేదీల్లో వరుసగా ఐదు రోజుల పాటు ఆధార్ అప్‌డేట్ చేయనున్నారు.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నిసచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది.అనంతరం మళ్లీ ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రెండో విడత క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఆధార్‌లో ఎవైనా తప్పుటు దొర్లితే ఏన్నో పనులు పెండింగ్‌లో పడిపోతుంటాయి. ఆధార్ సెంటర్‌లకు వెళితే అక్కడ రద్దీ రిత్యా పనులు సకాలంలో అవక ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఆధార్ అప్‌డేట్ చేసుకోని వారున్నట్లు సమాచారం. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రత్యేక క్యాంపులతో ఆధార్ అప్డేటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.