-పోలీసులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం డిమాండ్
నిన్న జరిగిన ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలలో ప్రసంగించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తాను హోం మంత్రిని కావాలని కోరుకుంటున్నానని అలా హోం మంత్రి అయితే పోలీసులపై షూట్ ఎట్ సైట్ ద్వారా పోలీసుల సంగతి తేలుస్తానని బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ, అయ్యన్నపాత్రుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
గతంలో బాధ్యతాయుతమైన మంత్రిగా పనిచేసి ప్రజాస్వామ్యంలో ఉంటూ, పోలీసుల మనోభావాలు దెబ్బతినే విధంగా , బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నాము. ఇటువంటి బాధ్యత లేని , ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేని వ్యక్తులు గతంలో మంత్రి పదవులు నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని అభిప్రాయ పడుతున్నాము.
రూల్ ఆఫ్ లా ను ధృఢ సంకల్పంతో అమలుచేస్తున్న పోలీసులను వివిధ సందర్భాలలో, చాలా మార్లు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన రాజకీయ స్వలాభం కోసం, పొలిటికల్ మైలేజీ కోసం పోలీస్ వ్యవస్థ పై అవాకులు చవాకులు మాట్లాడడాన్ని సమాజంలో అందరూ గమనిస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ, అయ్యన్నపాత్రుడు పై న్యాయపోరాటానికి వెనుకాడమని తెలియజేస్తున్నాము.