– రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
– ఈ నేల 16 న సీఎం కెసీఆర్ కి ధన్యా వాద సభ పోస్టర్ ను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల మరియు శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి , ఎంపీ బీబీ పాటిల్
హైదరాబాదులో మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ గజ్జల కాంతం, వివిధ కుల సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించినందుకు, తెలంగాణ సచివాలయం కు బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టినందుకు .. అలాగే, తెలంగాణ అమరవీరుల స్మృతి వనం ను నిర్మించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి మే – 16న ‘ధన్యవాద సభ’ ను నిర్వహిస్తున్న సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ ‘చలో ఇందిరా పార్క్’ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, తెలంగాణ ప్రజాసంఘాల జె.ఎ.సి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని , వేముల భాస్కర్, సంపత్ కుమార్ ,మోహన్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.