దేశంలో లో కార్మిక, కర్షక, చేతివృత్తుల పని చేసుకునే వారు ఈ రకమైన పనిచేసే వారైనా కూడా ఎవరైనా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ శ్రమ్ పేరుతో ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఈ ఇన్సూరెన్స్ పథకానికి ఒక్క రూపాయి కూడా ఎవరు ఎవరికి కట్టక్కర్లేదు. (ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు తప్ప) తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులే.
ఈ పథకం గూగుల్ సెర్చి లోకి వెళ్లి e sram అని టైప్ చేస్తే ఈ పథకం అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ మనము మొబైల్ లొనే పూర్తి చేసి పంపించవచ్చు. లేదా మనకు చేతకాకపోతే నెట్ సెంటర్ కి వెళ్లి నేను ఈ శ్రమ్ పథకంలో చేయదలచుకున్నానని వారికి చెబితే వారు మీ దగ్గర వివరాలు అన్ని తీసుకొని మీ అప్లికేషన్ ని అప్లోడ్ చేస్తారు.
ఈ పథకం ఏదైనా ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందితే ఒక లక్ష రూపాయలు, చనిపోతే రెండు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఎవరి అవసరం, రెకమెండేషన్ లేకుండా ప్రమాదం జరిగిన తర్వాత మనం అప్లికేషన్ ఏ విధంగా అయితే అప్లోడ్చేస్తామో ,అదేవిధంగా ఈ ప్రమాదా వివరాలు కూడా అప్లోడ్ చేస్తే పదిహేను రోజుల తర్వాత సంబందిత భార్యకు లేదా, వారసులకు ఆ డబ్బులు వస్తాయి.
కేంద్ర ప్రభుత్వం కొంతమందిని వారికి ఉపాధి కల్పించడం కోసం ఈ శ్రమ అప్లికేషన్ ఎన్రోల్ చేయుటకు నియమించి ఉన్నది. వారి ద్వారా అయినా మనము ఈ శ్రమ లో చేరవచ్చు .వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు గాని, పూర్తి చేసినందుకు డబ్బు కానీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ చేయడానికి వచ్చిన అతనికి కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
వారైనా కూడా మన ఇంటికి వచ్చి మన వివరాలు తీసుకుని ఈ పథకంలో మిమ్మలను చేర్చే అవకాశం ఉంది .వారికైనా సహకరించండి లేదా మీరయినా మీ ప్రాంతంలో ఉన్న వారికి కొంత మందికైనా ఈ స్కీమ్లో చేర్చవలసిందిగా కోరుచున్నాను.
ప్రధానమంత్రి మోడీ దేశంలో ఉండే బిజెపి కార్యకర్తల మీద ఈ బాధ్యత పెట్టినట్టుగా మనం భావించాలి పేద ప్రజల కోసం పెట్టిన ప్రతి పథకాన్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడే టట్లుగా చేస్తే మనకు సార్థకత ఉంటుంది మోడీ గారికి సార్ధకత ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేదా
ఎవరూ లేకపోతే నెట్ సెంటర్ కి వెళ్ళయినా సరే ఈ అప్లికేషన్ ఫి ల్ చేసి దీనిలో సభ్యులుగా చేరాలని, చేర్చాలని మిమ్మల్నందర్నీ మనసారా కోరుకుంటున్నాను. కుటుంబంలో సంపాదించే మనిషి చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశం తో మోడీ .. ఈ శ్రమ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఉచితంగా మొదలుపెట్టారు .
మనము సమాజానికి ఎంతో కొంత నేను కూడా సహాయపడాలి అనుకునే భావన, దృక్పథం కలిగినవారు మీ ప్రాంతాలలో కనీసం పదిమంది నైనా ఈ పథకం ద్వారా చేర్చి వారికి సహాయ పడవలిసిందిగా మిమ్మల్నందర్నీ మనసారా కోరుకుంటున్నాను.
– కరణం భాస్కర్ ,
బిజెపి
7386128877