– కొత్తగా జగన్ రెడ్డి కల్పించాల్సిన అవసరం లేదు
– రూ.5వేల కోట్లు దోచుకునేందుకు ఒటిఎస్ పేరుతో నాటకం
– టిడిపి ప్రభుత్వ హయాలో రాష్ట్రంలో 10.5లక్షల ఇళ్ల నిర్మాణం
– రెండున్నరేళ్లలో జగన్ రెడ్డి కట్టిన ఇళ్లు ఒక్కటి కూడా లేదు
– శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు
రోజువారీ కార్యకలాపాలకు కూడా ఎక్కడా అప్పుపుట్టని పరిస్థితుల్లో ఖజనాను నింపుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో పేదప్రజలను వంచనకు గురిచేస్తున్నారు. లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం 12 సంవత్సరాలు దాటిన తర్వాత పేదలవారు నివసించే ఇల్లు, స్థలంపై వారికి సంపూర్ణ హక్కులు లభిస్తాయి. ఈ వాస్తవాలను మరుగున పెట్టి పేదలనుంచి డబ్బు గుంజాలని చూడటం జగన్ రెడ్డి మోసపూరిత చర్యకు నిదర్శనం.
దశాబ్దాలనాటి ఇళ్లకు జగన్‌రెడ్డి ఈరోజు కొత్తగా సెటిల్ మెంట్ చేసి హక్కులు కల్పించడమేంటి? వివిధ రూపాల్లో ప్రజలను దోచుకోవడానికి అలవాటు పడిన జగన్‌రెడ్డి సంపూర్ణ గృహ హక్కు అంటూ పేదలనుంచి రూ.5వేల కోట్లు రాబట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రస్తుతం ఒటిఎస్ పథకం కింద అర్హులని చెబుతున్న వారిళ్లన్నీ దాదాపు 12సంవత్సరాలు దాటినవే. చట్టప్రకారం వారికి సొంతమైన ఇంటికి డబ్బులు కట్టి సెటిల్ మెంట్ చేసుకోవాలనడం దోచుకోవడం కాదా?
పాదయాత్ర సమయంలో ఏడాదికి 5 లక్షల చొప్పున ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు అందిస్తానని చెప్పిన జగన్ రెడ్డి…30 నెలల పాలనలో ఒక్క ఇంటినీ కట్టలేదు, ఇది పేదలను మోసగించడం కాదా?జగన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలకే తూట్లు పొడిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో నివాసయోగ్యంకాని ప్రాంతాల్లో స్థలాలిచ్చి.. వైసిపి నేతలు రూ.7000 కోట్లు దోచుకున్నారు.పేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చి ప్రజలు చెమటోడ్చి సంపాదించి కట్టుకున్న ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తూ పేదప్రజల ఉసురు పోసుకుంటున్నారు.
జగన్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే తెలుగుదేశం హయంలో పేద,మధ్యతరగతి ప్రజలకోసం నిర్మించిన 2.62లక్షల టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకు అందించాలి. తెలుగుదేశం ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో పిఎంవైఎ రూరల్ కింద 7.8లక్షల ఇళ్లు నిర్మించినట్లు మంత్రి శ్రీరంగనాథరాజు అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు. ఇవిగాక టిడ్కో పథకం కింద 2.62లక్షల ఇళ్లను 90శాతానికి పైగా పూర్తిచేశారు.
మొత్తంగా అయిదేళ్ల టిడిపి హయాంలో 10.5లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించాం, ఇవన్నీ అధికారిక లెక్కలే. రాజధానిలో ఇళ్లస్థలాలు ఇస్తామంటే తాము అడ్డుపడ్డామంటూ జగన్ రెడ్డి తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. వాస్తవానికి రాజధానిలో పేదలు విలావంతంగా నిర్మించే,దుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5వేల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం వాటిని అందించకుండా పాడుబెట్టి తీరని ద్రో హం చేసింది.
కరోనా నేపథ్యంలో పేదలు కొనుగోలు శక్తి కోల్పోయి రోజుగడవడమే కష్టంగా మారింది. ఈ సమయంలో ఒటిఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు దిగడం దుర్మార్గం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల కోసం నిర్మించిన ఇళ్లన్నింటినీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించాల్సింది డిమాండ్ చేస్తున్నాం.