• రాష్ట్రంలోని లక్షా20వేల మంది అంగన్ వాడీసిబ్బంది డిమాండ్లను ముఖ్యమంత్రి పరిష్కరించాల్సిందే
• అలాకాకుండా చేతిలో అవినీతిపత్రిక ఉందికదా అని విషప్రచారం చేస్తూ, అంగన్ వాడీ వ్యవస్థను నీరుగార్చాలని చూస్తే ఊరుకునేది లేదు
• ముఖ్యమంత్రి చెబుతున్న మహిళా సాధికారత, స్త్రీశిశు సంక్షేమం ఎక్కడున్నాయో అధికారపార్టీ మహిళా ప్రజాప్రతినిధులు చెప్పాలి
• అంగన్ వాడీసిబ్బంది దుస్థితిపై స్పందించలేనంత బిజీగా స్త్రీశిశుసంక్షేమశాఖా మంత్రి ఉన్నారా?
– టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
రాష్ట్రంలోని అంగన్ వాడీ వ్యవస్థను నిర్వీర్యంచేసేక్రమంలోనే ఏపీ వ్యాప్తంగా ఉన్న లక్షా20వేలమంది అంగన్ వాడీ సిబ్బంది జీతాల కోసం రోడ్డెక్కినా జగన్మోహన్ రెడ్డి తనఅవినీతిపత్రికలో సిగ్గులేని రాతలు రాయిస్తున్నాడని టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్య క్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తంచేశారు.మంగళవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
జీతాలుచాలక, జీవితాలు నెగ్గుకురావడం కనాకష్టమైన దుర్భర స్థితిలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వతీరుని నిరసిస్తూ రోడ్డెక్కిన అంగ న్ వాడీ సిబ్బంది గురించి అవహేళనగా, చులకనగా నీతిమాలిన రాతలురాయిస్తారా? సాక్షి నిర్వాహకురాలైన జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారు కూడా ఒకమహిళా పారిశ్రామికవేత్తగా ఉన్నా రు. అవినీతిసొమ్ముతో జగన్మోహన్ రెడ్డి పెట్టిన సాక్షిదినపత్రిక, న్యూస్ ఛానల్ ను కాస్తోకూస్తైనా క్రెడిబులిటీతో నిర్వహిస్తే మంచిద ని శ్రీమతి భారతిగారికి విన్నవిస్తున్నాం.
పాలకులు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రోడ్డెక్కిన అంగన్ వాడీలను తెలుగుదేశంవారు నడిపిస్తున్నారంటూ తప్పు డురాతలు రాయడం సాక్షి దినపత్రికకే చెల్లిందే. గతంలోకూడా అంగన్ వాడీలు ధర్నాలుచేశారు.. అప్పుడువారిని వెనకుండి ఎవరు నడిపించారో భారతిరెడ్డికి తెలియదా అనిప్రశ్నిస్తున్నాం.
వ్యవస్థలను నిర్వీర్యంచేస్తూ, ప్రశ్నించినవారిపై తప్పుడుకేసులు పెట్టడం, భౌతికదాడులకు తెగబడటం వంటిచర్యలతో విభజించు పాలించు అనేసూత్రం ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి పాలన సాగు తోందనే విషయం ఆయనసతీమణి భారతిగారికి తెలియదా?
జగన్మోహన్ రెడ్డి గతంలో తూతూమంత్రంగా జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్ లెస్ క్యాలెండర్ విడుదలచేస్తూ, అంగన్ వాడీల జీతా న్ని రూ.7,500నుంచి రూ.10,500లకు తమప్రభుత్వమే పెంచిం దని గొప్పలుచెప్పాడు. నిజంగా అంతదుర్మార్గంగా ముఖ్యమంత్ర్రి హోదాలో ఉన్నవ్యక్తి అబద్ధాలు ఆడటం ఈరాష్ట్రంలోనే చూస్తున్నాం . అంగన్ వాడీల జీతాన్ని రూ.4,500నుంచి రూ.10,500లకు పెంచిన ఘనత చంద్రబాబునాయుడిగారికి దక్కుతుంది. అందులో ఇసుమంతైనా సందేహంలేదు. గతంలో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హాయాంలో కేవలం రూ.500మాత్రమే అంగన్ వాడీల జీతాన్ని పెంచి, ఏదోఘనకార్యంసాధించినట్లుగా ప్రచారంచేసుకున్నారు.
2018లో జీవోనెం-18ద్వారా చంద్రబాబునాయుడు గారు అంగన్ వాడీ సిబ్బంది జీతం పెంచితే, ఆఘనతను తమదిగా చెప్పుకోవడా నికి నిజంగా ఇప్పుడు అధికారంలోఉన్నవారు సిగ్గుపడాలి. అంగ న్ వాడీ వ్యవస్థను నిజంగా పటిష్టపరిచి, బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించినఘనత ముమ్మాటికీ టీడీపీ ప్రభుత్వానిదే. ఎండుఖర్జూరాలు, పల్లీలతోకూడిన చిక్కీలు, కోడిగుడ్లు, నాణ్యమైనపాలు సకాలంలో అందించారు.
కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాఅని అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యేబియ్యం మొదలు ఇతరత్రా సరుకులన్నీ నాసిరక మైనవి, కుళ్లినవే. ఆఖరికి గర్భిణులు, చిన్నారులకు అందించే చిక్కీల పంపిణీ టెండర్లలో కూడా ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. చిత్తూరులోని ఒక అంగన్ వాడీకేంద్రంలో నాసిరకం కోడిగుడ్డుతిన్న చిన్నారి తీవ్రఅస్వస్థతకు గురై ప్రాణాలు పోగోట్టుకుంది. ఇలాంటి ఘటనలు అనేకం నిత్యం రాష్ట్రంలోచూస్తూనే ఉన్నాము. ఇవేవీ సాక్షిదినపత్రికకు కనిపించవు.
లక్షా20వేలమంది ఉన్న అంగన్ వాడీ వ్యవస్థతో పాటు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసింది చంద్రబాబుగారే. రాష్ట్రానికి ఇప్పుడు స్త్రీశిశు సంక్షేమశాఖామంత్రిగా ఉన్న ఆమె, ఏనాడైనా ఎక్కడైనా ఒక్క అంగన్ వాడీకేంద్రాన్ని అయినా సంద ర్శించి, సిబ్బందితో మాట్లాడారా? వారి కష్టసుఖాలు, సాధకబాధ కాలు విచారించారా? జగన్మోహన్ రెడ్డి ఆఖరికి తన ధనదాహానికి చిన్నారులకు అందించే పౌష్టికాహారంలో కూడా అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు.
రాష్ట్రవ్యాప్తంగా నిన్న ధర్నాలు, ఆందోళనలకు దిగిన అంగన్ వాడీ సిబ్బంది వెనక ఎవరూలేరని సాక్షి మీడియాగుర్తిస్తే మంచిది. కడు పు మండినవారే రోడ్డెక్కారు తప్ప, ఎవరో పిలిస్తే వారురాలేదు. మొన్నటికి మొన్న ఉద్యోగులు విజయవాడకు రాకుండా ఈ ప్రభు త్వం ఎన్నికుట్రలు, కుతంత్రాలుపన్నినా వారుఆగారా? ఉద్యోగు లు, ఉపాధ్యాయుల ధర్నాదెబ్బకు ఈప్రభుత్వానికి కళ్లుబైర్లు కమ్మాయి. వారిలానే నేడు కడుపుమంటతో, చాలీచాలని జీతాల తో బతకలేక, అంగన్ వాడీకేంద్రాలను కూడా నిర్వహించలేని దుస్థితిలో, పనిభారం ఎక్కువై మాత్రమే అంగన్ వాడీ సిబ్బంది ఆందోళనకు ఉపక్రమించారు. ఆ వాస్తవాన్ని ఈముఖ్యమంత్రి, సాక్షిమీడియా ఎంతత్వరగా గుర్తిస్తే అంతమంచిది.
అంగన్ వాడీ కేంద్రాల్లోని ఖాళీలనుభర్తీచేయకుండా, సూపర్ వైజర్ల నియామకంచేపట్టకుండా, జీతాలుపెంచకుండా ఈప్రభుత్వం ఎన్నాళ్లు ఇలా అంగన్ వాడీసిబ్బంది జీవితాలతో ఆటలాడుతుందని ప్రశ్నిస్తున్నాం.సంక్షేమం గురించి, మహిళాసాధికారత గురించి కల్లబొల్లికబుర్లు, మాయమాటలుచెప్పడం తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడూ ఏ ఒక్క ఆడబిడ్డకు న్యాయంచేసింది లేదు. టీడీపీప్రభుత్వంలో నియమితు లైన కళ్యాణమిత్రలు, గోపాలమిత్రలు, పశుమిత్రలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైపోయి ఉద్యోగాలుకోల్పోయారో చెప్పాల్సిన పనిలేదు.
మహిళా దినోత్సవం నాడే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన మహిళల్ని పోలీసులబూటుకాళ్లతో తన్నించిన కర్కోటకుడు ఈ ముఖ్యమంత్రి కాదా? అదేనా ఈయనచెప్పిన మహిళాసాధికారత? తల్లికి, చెల్లికి న్యాయంచేయలేని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని ఆడబిడ్డలకు న్యాయంచేస్తున్నాడంటే నమ్మాలా? ప్రభుత్వంలోఉన్న మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్మోహన్ రెడ్డి భజన తప్ప, ఆడబిడ్డల రక్షణ, వారియోగక్షేమాలు పట్టడంలేదు. అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు రోడ్లపైకి వస్తుంటే, అధికారం లో ఉన్నమహిళాప్రజాతప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదు?
నడిరోడ్డుపై ఆడబిడ్డలను, యువతుల్ని దారుణంగా వేధించి చంపుతున్నాకూడా నోరెత్తలేని దుస్థితిలో వైసీపీమహిళా ప్రజాప్రతినిధులు, మహిళామంత్రులుఉండటం దురదృష్టకరం. ఆడవాళ్లను అర్థనగ్నంగా మార్చి, గుడివాడలాంటి పట్టణాలకు కూడా క్యాసినోకల్చర్ తీసుకొచ్చిన ఘనత ఈముఖ్యమంత్రికే దక్కింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహమే అంగన్ వాడీలను రోడ్లెక్కించింది తప్ప, ఎవరోనడిపిస్తేనో, పిలిస్తేనో వారు రాలేదని గుర్తించండి. టీడీపీహాయాంలో మహిళలు గర్వంగా తలెత్తుకునేలా పనిచేసిన స్త్రీశిశుసంక్షేమ, హోంశాఖలు ఇప్పుడు ఎలా నిర్వీర్యమయ్యాయో, నిరుపయోగంగా మారాయో చూస్తూనే ఉన్నాం.
ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే అంగన్ వాడీలు కలెక్టరేట్ల ముట్టడికి పాల్పడితే, వారిని పిలిచిమాట్లాడకుం డా, చేతిలో పత్రిక ఉందికదాని తప్పుడురాతలురాయిస్తారా? అంగన్ వాడీసిబ్బంది డిమాండ్లను జగన్మోహన్ రెడ్డి తక్షణమే పరి ష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అంగన్ వాడీ సిబ్బంది వేతనా న్ని రూ.26వేలకు పెంచి, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాల ని, వారి ఉద్యోగవయోపరిమితినికూడా 62ఏళ్లకు పెంచాలని టీడీ పీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.
అలాకాకుండా రాష్ట్రంలో అంగన్ వాడీ వ్యవస్థే లేకుండా చేస్తామనిచూస్తే, అందుకు జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం తగినమూల్యం చెల్లించుకుంటుందని హెచ్చ రిస్తున్నాం. నిన్నరోడ్డెక్కిన అంగన్ వాడీ సిబ్బందే తమకు టీడీపీ ప్రభుత్వమే జీతాలుపెంచింది గానీ, ఈప్రభుత్వంకాదని చెప్పారు. జగన్ ప్రభుత్వం అంగన్ వాడీలకు న్యాయంచేసేవరకు వారి పక్షాన నిలిచి, టీడీపీ పోరాడుతుందని తేల్చిచెబుతున్నాం.