రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది

– దేశ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు షురూ చేస్తుండు
– బీజేపీపై విష ప్రచారం చేస్తుండు
– ప్రశ్నిస్తే హౌజ్ అరెస్టులు, కేసులు, జైళ్లంటూ భయపెడుతుండు
– బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు పనులు చేయొద్దని అనధికార ఆదేశాలిస్తుండు
– కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలపై ఎక్కడికక్కడ నిలదీయండి
– బీజేపీ కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు

‘‘రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం కేసీఆర్ కు అర్ధమైంది. ఏం చేయాలో తెల్వక పీకే (ప్రశాంత్ కిషోర్) అనే వ్యూహకర్తను పెట్టుకుని ‘ఫెడరల్ ఫ్రంట్’ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టిండు. బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విష ప్రచారం చేస్తుండు. ఎంత చేసినా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగట్లేదు. ప్రజలు బీజేపీవైపు మొగ్గు
sanjay1 చూపుతున్నరని సర్వేలు చెబుతుండటంతో తట్టుకోలేక బీజేపీ నేతలపై దాడులకు పురిగొల్పుతున్నడు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టలంటూ, జైళ్లంటూ భయపెడుతున్నడు. రాబోయే రోజుల్లో ఈ నిర్బంధాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అయినా బీజేపీ నేతలెవరూ భయపడాల్సిన పనిలేదు. జాతీయ నాయకత్వం మనకు పూర్తి అండగా ఉంది. ప్రజా సమస్యలపై ఉద్రుతంగా పోరాడండి. టీఆర్ఎస్ నేతల ఆరోపణలను, విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి ’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలుసహా స్థానిక ప్రజా ప్రతినిధులెవరికీ పనులు చేయొద్దంటూ కేసీఆర్ అనధికార ఆదేశాలిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుష్ట సాంప్రదాయం లేదని, ఇతర రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలకూ తగిన గౌరవం ఉంటోందని అన్నారు. చివరకు రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళ సై విషయంలోనూ కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ మేడారం వెళ్తే హెలికాప్టర్ సమకూర్చకుండా… మంత్రులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలకకుండా చేస్తున్నారంటే… కేసీఆర్ ఎంతటి చిల్లర వ్యక్తో అర్ధం చేసుకోవాలి.

ఈరోజు కరీంనగర్ లోని శుభ మంగళ గార్డెన్ లో ‘‘బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం’’ జరిగింది. బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు కటకం మ్రుత్యుంజయం, బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, జిల్లా నాయకులు శివరామక్రిష్ణ, అనిల్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితి, పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ….

‘‘కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నడు. రాష్ట్రం ‘బంగారు తెలంగాణ’ అయ్యిందట. దేశాన్ని కూడా ‘బంగారు భారత్’ చేస్తా’’డట. నిజంగా తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యిందా?’’అని ప్రశ్నించారు. ‘‘గతంలో కేసీఆర్ కరీంనగర్ కొచ్చి నగరాన్ని లండన్ చేస్తానన్నడు. వరంగల్ ను వాషింగ్టన్ చేస్తానన్నడు. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తానన్నడు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తానన్నడు. చేసిండా? ఇప్పుడు ఇగ ఇండియాను అమెరికా కన్న గొప్పగా చేస్తా.. బంగారు భారత్ చేస్తానని బయలు దేరిండు ఈ మాయ మాటల (పిట్టల) దొర!’’అని మండిపడ్డారు.

‘‘కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ ఎట్లున్నదో చూస్తున్నం కదా? ఎక్కడ చూసినా ఆత్మహత్యలే. ఎవరిని కదిలించినా కన్నీళ్లే… ఇత కీసీఆర్ చెప్పే బంగారు భారత్ ఎట్లుంటదో తెల్వాలంటే… తెలంగాణలో ఉన్న ఒక నిరుద్యోగిని, ఒక ఉద్యోగిని, ఒక రైతును, ఒక విద్యార్థిని, ఒక మహిళను, ఒక దళితుడిని అడిగితే చాలు! పూసగుచ్చినట్టు చెప్తరు.’’అని ఎద్దేవా చేశారు.

‘‘రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. కేసీఆర్ పాలన పీడ విరగాలని జనం కోరుకుంటున్నరు. ఎక్కడికి వెళ్లినా యువత బీజేపీ చేపట్టే కార్యక్రమాలకు స్వచ్ఛందంగా వస్తున్నరు. జై బీజేపీ అంటూ కాషాయ జెండా పట్టుకుని కదం తొక్కుతున్నరు.

‘‘రాబోయే రోజులో బీజేపీపై నిర్బంధాలు పెరుగుతాయి. ఇప్పటికే పోలీసులు కేసులు పెడుతున్నరు. జైళ్లో వేస్తున్నరు. హౌజ్ అరెస్టులు చేస్తున్నరు. అయినా లెక్క చేయవద్దు. ఇలాంటి ఇబ్బందులన్నీ తాత్కాలికమే. పార్టీ జాతీయ నాయకత్వం మనకు పూర్తి అండగా ఉంటుంది. స్థానిక సమస్యలపై ప్రజలకు అండగా ఉంటూ పోరాడండి. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించేదాకా విశ్రమించొద్దు.’’ అని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, బీజేపీ ఎంపీలు సాధించిందేమీ లేదని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను బండి సంజయ్ ప్రస్తావిస్తూ… ‘‘తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం గత ఏడేళ్లలో దాదాపు రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అంతెందుకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్లు, రదారులు, రైల్వే పనులుసహా ఇతర మౌలిక సదుపాయాల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నం. ఇటీవల సీఆర్ఐఎఫ్ నిధులు రాష్ట్రానికి రూ.600 కోట్లు మంజూరైతే అందులో ఒక్క ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే రూ.200 కోట్లు మంజూరైనయ్. వరంగల్ – జగిత్యాల హైవే పనులు, సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి పనులు కోసం వందల కోట్ల రూపాయలు మంజూరైనయ్.

త్వరలోనే కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లైన్ పనులకు ఆమోదం లభించబోతోంది. ఇవిగాక జిల్లాకు ఈజీఎస్ నిధులు పెద్ద ఎత్తున వస్తున్నయ్. అంతెందుకు.. గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే అభివ్రుద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో ఖర్చు చేస్తున్నవే. ఈ విషయాలన్నీ మీరంతా పల్లె పల్లెకూ తీసుకెళ్లి వివరించాలి. మీడియా, సోషల్ మీడియాను విరివిరివిగా ఉపయోగించుకోవాలి’’అని సూచించారు.

క్రమశిక్షణ అంశాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ ‘‘బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే…. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందే… కట్టుతప్పితే ఎంతటి వారైనా సరే… సహించే ప్రసక్తే లేదు. వేటు తప్పదు’’అని హెచ్చరించారు.

ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటరు.వారు పనిచేయరు. పనిచేసే వాళ్లపై అక్కసు గక్కడమే వారి పని. అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. పార్టీ కోసం చిత్తశుద్దితో క్రుషి చేయాలి. అధికారంలోకి వచ్చే సమయమిది. అలాంటి వాళ్ల మాటలు నమ్మి మీరు దారి తప్పితే మీ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటది’’అని హితవు పలికారు.

Leave a Reply