Suryaa.co.in

Andhra Pradesh

నవంబర్లో చేయాల్సిన డ్వాక్రారుణమాఫీ, ఫిబ్రవరి వచ్చినా చేయలేదేం జగన్ రెడ్డి?

•  అప్పు పుడితేనే బటన్ నొక్కుతావా?
• జగన్ రెడ్డి తక్షణమే డ్వాక్రామహిళలకు మూడోవిడత రుణమాఫీ నిధులివ్వాలి
• కల్లబొల్లిమాటలు, మోసపు వాగ్ధానాలతో వంచించాలని చూస్తే, ముఖ్యమంత్రి కోటి15 లక్షల డ్వాక్రామహిళల ఆగ్రహాన్ని చవిచూస్తాడు
-టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

అప్పులు పుడితేతప్ప ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, రిటైరైన వారికి పింఛన్లు ఇవ్వ లేని దుస్థితిలో ఉన్న జగన్ రెడ్డి, డ్వాక్రామహిళలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కాడని, నవంబర్లో వారికివ్వాల్సిన మూడోవిడత రుణమాఫీ నిధులు, ఫిబ్రవరి వస్తున్నాఇవ్వలేదని టీడీపీ అంగన్ వాడీ విభాగం, డ్వాక్రాసాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సు నీత తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆమె మాటల్లోనే…

“అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా, జగన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మూడున్నరేళ్లలో ముక్కిమూలిగి కేవలం రెండుసార్లు మాత్రమే డ్వాక్రారుణమాఫీ చేసిన జగన్ రెడ్డి నవంబర్ లో చేయాల్సిన మూడో విడత రుణమాఫీ ఇప్పటికీ చేయలేకపోయాడు. అప్పులు పుడితే తప్ప బటన్ నొక్కలేని ముఖ్యమంత్రి అసహాయత, అసమర్థతను చూసి, డ్వాక్రామహిళలు తమకు న్యాయం చేయడని భావిస్తున్నారు. మోసపూరిత వాగ్ధానాలతో తమను వంచించాడని వాపోతున్నారు.

జగన్ రెడ్డికి మహిళలంటే చిన్నచూపు, డ్వాక్రాసంఘాల్ని జనసమీకరణ సంఘాలుగా మార్చాడు
జగన్ రెడ్డి డ్వాక్రాసంఘాల్ని జనాన్ని సమీకరించే సంఘాలుగా వాడుకుంటున్నాడు. డ్వాక్రామహిళల్ని చిన్నచూపుచూస్తూ, తనస్వార్థానికి వాడుకుంటున్నాడు. అధికారం లోకి వస్తే డ్వాక్రామహిళలకు ఉన్న రూ.27వేలకోట్ల రుణాల్ని మాఫీ చేస్తానన్న జగన్ రెడ్డి, తరువాత రూ.25వేలకోట్లని మాటమార్చాడు. చివరకు చచ్చీచెడి మూడున్న రేళ్లలో రూ.12వేలకోట్ల పైచిలుకు మాత్రమే మాఫీ చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 98లక్షల డ్వాక్రామహిళలు ఉన్నారన్న జగన్ రెడ్డి, రుణమాఫీ సమయానికి వారిసంఖ్యను 75లక్షలకు కుదించాడు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.3వేల చొప్పున సంవత్సరానికి రూ.36 వేలు ఇస్తానన్న జగన్ రెడ్డి, పిచ్చిపిచ్చి నిబంధనలతో ప్రతిమహిళకు రూ.18,500లు మాత్రమేఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. జగన్ రెడ్డికి మహిళలంటే చిన్నచూపు, మహిళలకు భద్రత లేదు.. డ్వాక్రామహిళలకు ఆర్థికస్వావలంబన లేదు. జగన్ జమానాలో డ్వాక్రా సంఘా లు నిర్వీర్యమయ్యాయి, డ్వాక్రామహిళలకు కన్నీళ్లు, కష్టాలే మిగిలాయి. ప్రతి డ్వాక్రా మహిళ ఇప్పటికైనా చంద్రబాబు పాలనలో తమకుజరిగిన మంచిని, జగన్ హాయాంలో తమకు జరుగుతున్న వంచన, ఎదురవుతున్న వేధింపులపై ఆలోచించుకోవాలి.

చంద్రబాబు మహిళా సంక్షేమానికి లక్షకోట్లు ఖర్చుచేస్తే, జగన్ రెడ్డి గృహనిర్మాణం పేరుతో లక్షకోట్లు దోచేశాడు
ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు డ్వాక్రామహిళల్ని భాగస్వాముల్ని చేసేవారు. చంద్రబాబునాయుడు డ్వాక్రామహిళలకు ఇసుకరీచ్ ల నిర్వహణ అప్పగించి, వారి సమర్థతను మరింత పెంచాడు. డ్వాక్రామహిళలకు రూ.14,500కోట్ల రుణం ఉంటే, చంద్రబాబు పసుపు-కుంకుమకింద కోటిమందికి రూ.20,500కోట్లు ఇచ్చి, వారిపై తన కున్న అభిమానాన్ని చాటుకున్నాడు. డ్వాక్రామహిళల్ని బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటివారికి పరిచయంచేసి, వారి పనితీరు ప్రపంచానికి తెలిసేలా చేశాడు. చంద్రబాబు నాయుడు మహిళా సంక్షేమానికి రూ.లక్షకోట్లు ఖర్చుపెడితే, జగన్ రెడ్డి గృహనిర్మా ణం పేరుతో మూడున్నరేళ్లో లక్షకోట్లు దోచేశాడు. జగన్ చెప్పిన ఆసరాపథకం ఏమైం ది..ఎక్కడుంది? నవంబర్లో డ్వాక్రారుణమాఫీ కోసం నొక్కాల్సిన మీట, ఫిబ్రవరి వచ్చినా ఎందుకు నొక్కలేదు. అబద్ధాలతో జగన్ రెడ్డి డ్వాక్రామహిళల్ని వంచిస్తున్నాడు.

కోటి15లక్షల మంది డ్వాక్రామహిళలు జగన్ రెడ్డి ఓటమికోసం కసితో పనిచేయాలి
జగన్ రెడ్డికి చేతనైతే, దమ్ముంటే డ్వాక్రామహిళలకు చేస్తానన్న రూ.25వేలకోట్ల రుణమాఫీని తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా నవంబర్లో ఇవ్వాల్సిన మూడోవిడత రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని, చేయక పోతే డ్వాక్రామహిళల ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తు న్నాం. తమ రుణాలు పొందేవరకు డ్వాక్రామహిళలు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేస్తున్నాం. రాష్ట్రంలోని కోటి15లక్షల మంది డ్వాక్రామహిళలు జగన్ రెడ్డి ఓటమికోసం కసితో పనిచేయాలి. జగన్ రెడ్డిని ఇంటికి పంపేవరకు విశ్రమించకుండా పోరాటం చేయాలి. అప్పులు పుడితేతప్ప, ప్రభుతాన్ని నడపలేని అసమర్థస్థితిలో ఉన్న జగన్ రెడ్డి కల్లబొల్లిమాటలు నమ్మవద్దు” అని సునీత హితవుపలికారు.

LEAVE A RESPONSE