చిరంజీవి జగనన్న ను సినిమా రేట్ల కోసం బ్రతిమలాడు కున్నాడు.. YES.. ముఖ్యమంత్రి అంటే అదే మరి.. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ తమ సమస్యలు పెద్దమనసు చేసుకొని అడిగి పరిష్కారం చేసుకోవల్సిందే,, ఎక్కడ తగ్గి పదిమంది కోసం అడిగాడో అక్కడే ఆయన మంచితనం, సమస్యకు పరిష్కారం చూపాడో నాయకుని మంచితనం తెలిసి పోయింది.
చిరంజీవి ఇండస్ట్రీ పెద్దకాదు, అన్నా…YES నే.. పెద్ద కాదు. కాని సమస్య జటిలమయినపుడు సామాన్యుడుగా పరిష్కారం కోసం వెళ్ళాడు… పరిష్కారం చేసుకున్నారు.. అదీ కొందరకి నచ్చలేదు…
పవన్ ను పొగడాడని మార్ఫుడు వీడియో ద్వారా ద్వేషాన్ని ఆచార్య రెండు రోజులు ముందు పబ్లిసిటీ చేసి ట్రోలు చేసారు, అది పార్టీ అభిమానులలో డివైడ్ టాక్ కు బీజం వేసి, ద్వేషంనకు బీజం వేసారు.
స్వతహాగా వివాదరహితుడు..అరే అంటే ఒరే అనలేని వాడు, 40 ఏళ్ళ చరిత్రలో తిట్టినా చూడనట్లు పోయేవాడు, తలవంచుకుంటే తలేం తెగిపడిపోదు అనే మృదుస్వభావి, రాజకీయ చదరంగం లో కూడా బాలెన్సు తప్పని చిరంజీవి ని ఆయన సినిమాను పనిగట్టుకొని ఎవరో డిఫరెంటు టాకు సినిమా విడుదల రెండు రోజుల ముందే తెచ్చేసారు,, ఇక కొందరు అలా అనుకుంటున్నారు…
అసలు యురేనియం తవ్వకాలు, దాని అనుమతులు, యురేనియం మైనింగు,చర్మవ్యాధులు, పక్క రాష్ట్రంలో అనుమతులు, అక్కడి వారి వ్యధలు అనే ఎంతమంచి కాంటెపరీసబ్జెక్టు,, రాజకీయాలకు భయపడే పాదఘట్టమనే ఊరొక వైపు అంటూ ఫిక్షన్ గా చెప్పారు,, కాని సినిమాలో సనాతన ధర్మం, ఆయుర్వేదం, అమ్మవారు అనే కాకరకాయ కీకరకాయ కధలేదు.. అది ఊరికే బ్యాక్ డ్రాపు,, అంతా నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలపై ఆలోచన రేకెత్తించే అత్యద్భుత సందేశం గల ఫైట్ సినిమా.
కాంటెంపరీ కధ, అవసరమైన మేరకే CGI గ్రాఫిక్సు, అనవసర ఎలివేషన్లు లేకుండా, మంచి BGM తో, అత్యద్భుత వాయిస్ మాడ్యులేషన్, వేరియేషన్సుతో, ఫైట్సుతో, స్టెప్సుతో,పెద్ద పెద్ద కళ్ళతో మనలను కట్టిపడేస్తారు.
రాజకీయాలు పట్టించు కోకుండా, మంచి మైండుతో, చిరంజీవి కోసం వెళ్ళండి,. ఆ జనహృదయ కధానాయకుడు, ఆచార్యగా మిమ్మల్ని నిరాశపరచడు…
– Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.