Suryaa.co.in

Andhra Pradesh

సురేష్… యర్రగొండపాలెం నీ యబ్బా జాగీర్ ?

– మంత్రి సురేష్ వచ్చే ఎన్నికల్లో సీటు కోసం వీధినాటకాలకు తెరలేపారు
– తాగుబోతుల్ని పోగు చేసుకుని చంద్రబాబు పర్యటనలో అలజడికి కుట్ర పన్నారు
– చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేసిన వైసీపీ అల్లరి మూకల్ని వదిలే ప్రసక్తే లేదు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడి పర్యటనలో వైసీపీ అల్లరి మూకల తీరు దుర్మార్గం. సురేష్ యర్రగొండపాలెం ఎవడబ్బ జాగీర్ ? ప్రతిపక్ష నేతకు పర్యటించే హక్కు లేదా? మంత్రి సురేష్ వచ్చే ఎన్నికల్లో సీటు కోసం వీధినాటకాలకు తెరలేపారు. తాగుబోతుల్ని పోగు చేసుకుని చంద్రబాబు పర్యటనలో అలజడికి కుట్ర పన్నారు. నీ నియోజకవర్గంలో దళితులపై దాడులు జరుగుతుంటే స్పందించలేని దద్దమ్మని నువ్వు దళితుల గురించి మాట్లాడుతావా?

జగన్ దగ్గర మెప్పు కోసం నీ చొక్కా నువ్వే విప్పుకున్నావ్..రేపు ఎన్నికల్లో ప్రజలే నీ చొక్కా చింపి కొడతారు. జెడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల విసురుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ ఘటనలో ఎన్.ఎస్ .జీ కమాండర్ సంతోష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. కానీ మంత్రి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకెళ్లి కాళ్లకు చేతులు కట్లి హాస్పిటల్లో చేర్చి డ్రామాలాడటం సిగ్గుచేటు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు.

LEAVE A RESPONSE