– పార్టీ టీచర్స్ ఫెడరేషన్ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి
ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిలా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ (వైఎస్ఆర్ టిఎఫ్) వ్యవహరించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం తలపెట్టిన విప్లవాత్మక మార్పులు తద్వారా ప్రజలకు చేస్తున్న మంచిని సహచర ఉపాధ్యాయులకు వివరించాలన్నారు.
గతంలో మాదిరిగా కాకుండా ఉపాధ్యాయుల బదిలీల దగ్గర నుండి ఎంఈఓల నియమాకాల వరకు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందన్నారు..భవిష్యత్తులో కూడా టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పార్టీ విభాగ ఉపాధ్యాయ సంఘంలోని నాయకులు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఏర్పాటైన కొత్త కమిటి ద్వారా ఫెడరేషన్ ను బలోపేతం చేయాలన్నారు.
టిచర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి, ఎంవీ రామచంద్రరెడ్డి, టిచర్స్ ఫెడరేషన్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు..
పార్టీ విభాగ కమిటీల ప్రతిపాదనలను పంపండి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగ కమిటీల ప్రతిపాదనలను కేంద్ర కార్యాలయానికి పంపించాల్సిందిగా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలను ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి విజ్ణప్తి చేశారు.ఈ మేరకు రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు,విభాగ జోనల్ ఇంచార్జిలు,విభాగ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.