ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి
జనసేన పార్టీపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు లో పేర్కొన్నారు.గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన గుర్తింపులేని పార్టీ.. గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బోగస్ ఓట్లు అనేవి లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. టీడీపీ వారు ఉద్ధేశ పూర్వకంగా వైఎస్సార్‌సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేశాం’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారు. ఇలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరామని…తెలంగాణ ఓటర్ లిస్టులో డిలీట్ చేశాకే ఏపీలో ఓటరుగా నమోదు చేసుకోవాలి… యువగళం, చంద్రబాబు సభలో అసభ్యపదజాలంతో సీఎం జగన్‌ను విమర్శించారని…లోకేష్ ఎర్రబుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నాడు. అధికారుల పేర్లు నోట్ చేసుకుంటూ వాళ్లను సర్వీస్ నుండి తీసేస్తాం అంటూ లోకేష్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని…లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరామని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు ఒకే రోజు ఎన్నికలు జరపాలని కోరాం .
ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చు . చంద్రబాబు జీవితమే మోసపూరితం.. కుట్రలతో నిండిపోయిందని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు… పలు విషయాలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు లు చేసినట్లు పేర్కొన్నారు.