– భూదాన్ పోచంపల్లి, తుక్కుగూడ ,బండ్లగూడ జాగిర్, కొంపల్లి మున్సిపాలిటీలలో టాస్క్ ఫోర్స్ చర్యలు
– గత వారం రోజుల్లో 75 అక్రమ నిర్మాణాలు కూల్చివేత, 20 నిర్మాణాల సీజ్
హైదరాబాద్ : మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటి (హెచ్ఎండిఎ) అధికారులు దాడులు కొనసాగుతున్నాయి.సోమవారం(24న) భూదాన్ పోచంపల్లి, తుక్కుగూడ, బండ్లగూడ జాగీర్, కొంపల్లి మున్సిపాలిటీల పరిధిలో టాస్క్ఫోర్స్ బృందాలు అక్రమ భవనాల నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపట్టాయి.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఐదు(5) అక్రమ నిర్మాణాలను, బండ్లగూడ జాకీర్ మున్సిపాలిటీ పరిధిలో మూడు (3) అక్రమ నిర్మాణాలను, తుక్కుగూడ అ మున్సిపాలిటీ పరిధిలో మూడు(3) అక్రమ నిర్మాణాలను, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండు(2) అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకున్నాయి. గత వారం రోజుల్లో 75 అక్రమ నిర్మాణాలు కూల్చివేయగా మరో 20 అక్రమ నిర్మాణాలను టాస్క్ ఫోర్స్ బృందాలు సీజ్ చేశాయి.