– బుద్ధా వెంకన్నపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుని, తక్షణమే విడుదల చేయాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
టీడీపీ నేతలను బూతులు తిట్టిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయలేదు.? చంద్రబాబు నాయుడును అనేక రకాలుగా తిట్టిపోసుకుంటున్న బూతుల మంత్రిపై ఒక్క కేసైనా పెట్టారా? చంద్రబాబును నా కొడకా, ఒక్క దెబ్బ తొక్కుకుంటూపోతే చంద్రబాబు ఏమీ మిగలడని నాని అన్నప్పుడు ఈ పోలీసులకు ప్రతిపక్షనేతల ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన రాలేదా.? ఆ వ్యాఖ్యలపై ఇంతవరకైనా నానిని పోలీసులు వివరణ అడిగారా.? డీజీపీ తప్పు చేస్తే ఎక్కడ ఉన్నా పట్టుకొస్తామని చట్టం ప్రకారం అన్నదాంట్లో తప్పేముంది.?
డీజీపీ తప్పు చేయకపోతే ఆయనపై ఎలాంటి విచారణలూ ఉండవు. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలతో పాటు పోలీసుల అక్రమ కేసులపై టీడీపీ పోరాడాల్సి వస్తోంది. క్యాసినో నిర్వహించకపోతే విచారణకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అక్రమాలు బయటపడ్డాయన్న అక్కసుతోనే బూతులతో శివాలెత్తిపోతున్నారు. ప్రజల్ని జూదంలోకి లాగి దివాళా తీయిస్తున్నారు. ప్రజలను లూఠీ చేస్తున్న వైసీపీపై టీడీపీ నేతలు పోరాడుతున్నందునే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. గుడివాడలో టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు.? తాత్కిలిక కేసులతో మమా అనిపిస్తున్నారు.
మూడు రోజులు క్యాసినో నిర్వహిస్తే ఏం పీకారని వైసీపీ నేతలే పోలీసులను తిట్టారు. అంతకంటే సాక్ష్యం ఏం కావాలి. దాన్ని పక్కదారి పట్టించేందుకు వ్యక్తిగతంగా తిడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసి, బెదిరించి, దాడులు చేసినా ప్రజాక్షేమం కోసం పోరాడుతూనే ఉంటాం. తక్షణమే బుద్ధా వెంకన్నపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుని విడుదల చేయాలి. లేదంటే అక్రమ కేసులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం.