తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిటాల వర్ధంతి

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన పరిటాల రవీంద్ర వంటి నాయకులు మనకు దూరం అవ్వడం అత్యంత బాధాకరమని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పరిటాల రవీంద్ర 17వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. పేదల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించిన పరిటాల రవీంద్ర లాంటి నాయకుల ఆవశ్యకత రాష్ట్రానికి ఎంతగానో ఉందని ఆకాంక్షించారు.

బడుగు బలహీనవర్గాల అబ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అధికారంలో ఉన్నా లేకున్నా బడుగు బలహీన వర్గాలకు ఆర్ధిక రాజకీయ ప్రోత్సాహం అందించేందుకు కృషి చేసింది. కానీ.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు బడుగు బలహీనవర్గాలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ అణచివేతకు గురి చేస్తున్నారు. ప్రజల్ని వేధించి వికృత ఆనందం పొందుతున్నారు.

ప్రశ్నించే వారే ఉండకూడదు అనేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని, ప్రజా సమస్యలపై నిలదీసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి కూడా మనసు రాని ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, వల్లూరు కుమార్ స్వామి, తెలుగు మహిళ నాయకురాలు వేగుంట రాణి తెలుగుదేశం పార్టీ నేతలు బెల్లంకొండ నరసింహారావు, రాజశేఖర్, ప్రవీణ్, ఎం.వి.ఎస్. చౌదరి పాల్గొన్నారు.