– పాత మొబైల్ కు కొత్త స్టీల్ పాత్ర ..భయంకరమైన ‘డేటా’ స్కామ్!
మీ ఇంట్లో మూలన పడి ఉన్న పాత, విరిగిపోయిన ఫోన్ ఇచ్చి.. దానికి బదులుగా వీధిలో తిరిగే వ్యాపారి వద్ద కొన్ని స్టీలు పాత్రలు తీసుకున్నారా? “చెత్తకు మంచి బేరమే కుదిరింది” అని మీరు మురిసిపోతుంటే.. మీరు పొరపాటే కాదు, మీ జీవితకాల సంపాదనను ప్రమాదంలో పడేసినట్లే!
ఈ పాత మొబైల్స్ వెనుక ఉన్న అసలు నిజాన్ని ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ పోలీసులు బయటపెట్టారు. ఆ నిజాలు చదివితే మీరు నమ్మలేని నిజాలు తెలుస్తాయి..
ఉత్తర ప్రదేశ్ .. బీహార్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ కటిహార్..
బయటకు ఒక సామాన్య మొబైల్ షాప్ రిపేర్ షాప్ ఓనర్ లోపల మటుకు ఒక అంతర్జాతీయ డేటా దొంగల ముఠా డాన్!
బీహార్‌లోని కటిహార్‌కు చెందిన “ ఇస్తార్ ఆలం “ అనే వాడు ఒక చిన్న మొబైల్ షాపు నడుపుతుంటాడు. బయటి ప్రపంచానికి అతను ఒక సామాన్య వ్యాపారి. కానీ తెరవెనుక అతను అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లకు ‘వెపన్ సప్లయర్’. అవును, ఈ గ్యాంగ్ మీ పాత ఫోన్ల మదర్‌బోర్డులను చైనా మరియు బంగ్లాదేశ్‌లకు తరలిస్తూ, మీ వ్యక్తిగత డేటాను దొంగిలించి, మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ఒక భారీ నెట్‌వర్క్‌ను నడుపుతోంది.
మార్చి 16న ఉత్తర ప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లా లాల్గంజ్ పోలీసులు ఒక అనుమానాస్పద ట్రక్కును ఆపారు. అందులో వెతుకుతుంటే పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. అందులో ఏకంగా 11,605 పాత మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు కోటి రూపాయల పైమాటే! ఆ ట్రక్కులో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ కథలోని అసలు విలన్ ‘ఇస్తార్ ఆలం’ పేరు బయటకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన బీహార్ STF మరియు UP పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి, కటిహార్‌లో ఇస్తార్ కు బేడీలు వేశారు.
వీధిలోని ‘పాత్రల మారకం వ్యాపారం’ వెనుక అసలు ప్లాన్..
ఈ ముఠా పనితీరు అత్యంత పకడ్బందీగా ఉంటుంది:
1. టార్గెట్: బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, తమిళనాడు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఇస్తార్ తన ఏజెంట్లను (ఫెర్రీమెన్) దింపాడు.
2. ఆకర్షణ: వీరు వీధుల్లో తిరుగుతూ పాత ఇనుప సామాను కొనేవారిలా నటిస్తారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని, మెరిసిపోయే కొత్త స్టీలు పాత్రలు లేదా ప్లాస్టిక్ డబ్బాలను ఎరగా వేస్తారు.
3. డీల్: డబ్బుకు బదులుగా పాత మొబైల్ ఫోన్లను అడుగుతారు. “పనికిరాని చెత్తే కదా” అని జనం తమ ఫోన్లను ఇచ్చేస్తారు. కానీ ఆ ఫోన్ రూపంలో తమ సర్వస్వాన్ని దొంగల చేతిలో పెడుతున్నామని వారికి తెలియదు.
మొబైల్ ఫోన్ పాడైపోయినా, విరిగిపోయినా దానిలోని ‘మదర్బోర్డ్’ లోని ROM మెదడు “ మాత్రం సురక్షితంగా ఉంటుంది. మీ ఫోటోలు, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు అన్నీ అందులోనే నిక్షిప్తమై ఉంటాయి. ఇస్తార్ ఆలం ఈ ఫోన్లన్నింటినీ కటిహార్‌లోని తన రహస్య అడ్డాకు చేర్చి, వాటి నుంచి మదర్‌బోర్డులను వేరు చేస్తాడు.
విచారణలో తేలిందేమిటంటే, ఇస్తార్ ఆలం గత ఏడాది కాలంగా చైనా మరియు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రమాదకరమైన సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపాడు. ఈ మదర్‌బోర్డులను కంబోడియా, మలేషియా మరియు మయన్మార్ వంటి దేశాలలో ఉన్న సైబర్ స్కామ్ కాంపౌండ్స్‌కు తరలిస్తున్నాడు.
అక్కడ ఉన్న హ్యాకర్లు అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉపయోగించి మీ పాత మదర్‌బోర్డుల మీది ROM నుంచి డిలీట్ చేసిన డేటాను కూడా రికవరీ చేస్తారు. ఇది కేవలం విదేశీయులకే కాదు, మన దేశంలోని ‘జామ్తారా’ వంటి సైబర్ నేరగాళ్లకు కూడా చేరుతోంది. అంటే మీ పాత ఫోన్ ఇప్పుడు దేశ భద్రతకు ఒక పెద్ద ముప్పుగా మారింది.
ఈ వ్యాపారంలో లాభాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. ఒక సామాన్య దినసరి కూలీగా చెప్పుకునే ఈ గ్యాంగ్ మెంబర్ బ్యాంక్ ఖాతాను పోలీసులు తనిఖీ చేయగా, గత రెండేళ్లలో అందులో 45 లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఈ నల్లధనం వెనుక ఉన్న ఆర్థిక మూలాలను వెలికితీయడానికి ఇప్పుడు ‘ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్’ (EOU) రంగంలోకి దిగింది.
మీరు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?
మీ వ్యక్తిగత భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఈ జాగ్రత్తలు పాటించండి:
* గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మకండి: వీధిలో తిరిగే పాత్రల వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పాత స్మార్ట్ఫోన్లను ఇవ్వకండి.
* గుర్తింపు కార్డు అడగండి: ఒకవేళ ఫోన్ అమ్మాల్సి వస్తే, కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తనిఖీ చేయండి.
* లిఖితపూర్వక రసీదు: ఫోన్ అమ్మినప్పుడు తేదీ మరియు IMEI నంబర్‌తో కూడిన రసీదు తీసుకోండి. భవిష్యత్తులో ఆ ఫోన్ ఏదైనా నేరంలో దొరికితే ఆ రసీదే మిమ్మల్ని కాపాడుతుంది.
* ఫ్యాక్టరీ రీసెట్: ఫోన్ ఇచ్చే ముందు డేటాను పూర్తిగా డిలీట్ చేసి ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయండి. వీలైతే అధీకృత (Authorized) రీసైక్లింగ్ సెంటర్లలో మాత్రమే ఫోన్లను అప్పగించండి.
ఈ డిజిటల్ ఇండియా యుగంలో మీ డేటానే మీ ఆస్తి. ఒక్క పాత ఫోన్ మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీయగలదు. జాగ్రత్తగా ఉండండి!
జిహాద్ ఇప్పుడు ప్రతి రంగంలోకి ప్రవేశించింది..
– ఉత్తిష్ట భారత