– భారతదేశ మహిళకు ఎన్డీఏ సగర్వ నజరానా
– దేశంలో తొలిసారి మహిళలకు యూనివర్శిటీ నిర్మించిన ఘనత అన్నగారిదే
– మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలిచ్చిన ఎన్టీఆర్
– మహిళను స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబుదే
– మహిళలకు ‘దీపం’ గ్యాస్ పథకం తెచ్చిన చంద్రబాబునాయుడు
భారత ప్రజాస్వామ్య చరిత్రలో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అధినియం ఒక చారిత్రాత్మక మలుపు. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, అబలలు సబలలుగా మారి, దేశ విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యే ఒక సరికొత్త నవశకానికి నాంది.భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో మాత్రం దశాబ్దాలుగా నామమాత్రంగానే ఉండిపోయింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రయాణం ఒక సుదీర్ఘ పోరాటం. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారనున్నది. ఈ అసమానతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చగలదు. రాజకీయ సాధికారతకు బాటలు వేస్తున్న ఈ బిల్లు, భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేసే ఒక విప్లవాత్మక అడుగు. పార్లమెంట్ సాక్షిగా ఆమోదం పొందనున్న మహిళా బిల్లు, మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తూ వారి గళానికి బలాన్ని ఇవ్వనున్నది .
ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్న సూక్తిని అక్షరాలా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఆనాడు ఎన్టీఆర్ గారు అడగడుగునా మహిళలకు ఆత్మగౌరవాన్ని పంచితే, చంద్రబాబు ఆధునిక సాంకేతికతను, ఆర్థిక వనరులను జోడించి మహిళలను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా శక్తి వందన్ అధినియం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నూతన అధ్యాయం.
కేంద్రంలో వున్న ఎన్ డి ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్ఫూర్తి నిచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులు దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలయ్యాయి.నేడు పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో, తెలుగు నేలపై మహిళల కోసం జరిగిన ఎన్నో విప్లవాత్మక మార్పులు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతున్న ఈ చారిత్రక సందర్భంలో తెలుగు నాట మహిళా సాధికారతకు ఆద్యులైన ఎన్టీఆర్ ఆశయం. చంద్రబాబు ఆచరణ అద్భుతం అని చెప్పాలి.
మహిళ కేవలం ఇంటికే పరిమితం కాకూడదని, ఆర్థికంగా స్వతంత్రు రాలైనప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందని నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఇంత చైతన్యవంతంగా ఉండటానికి ఆనాడు ఎన్ టి ఆర్ వేసిన పునాదియే కారణం.ఒక్క మహిళలకు ఆస్తి చట్టమే కాదు.అనేక పథకాలు ప్రకటించి మహిళల పక్షపాతిగా నిలిచారు. ఎన్టీఆర్ కేవలం మాటలతో సరిపెట్టకుండా, చేతల్లో మహిళా సాధికారతను చూపించారు.ఆస్తిలో హక్కు – ఆదర్శప్రాయమైన నిర్ణయం.ఆయన నివాసం కోసం ఇళ్లు నిర్మించి వాటిని కేవలం తన పేరో, లేదా కుమారుల పేరో కాకుండా, తన కోడళ్ల పేరున పెట్టడం ఆయన ఆదర్శనానికి నిదర్శనం. ఆడబిడ్డలకు, కోడళ్లకు ఇచ్చే గౌరవం ఇంటి నుండే మొదలవ్వాలని ఆయన నమ్మేవారు.సమాజంలో సగ భాగమైన మహిళలను గౌరవించ బడినప్పుడే, ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని ఎన్టీఆర్ ఆశయం . అట్లాగే దేశం మొత్తం మహిళా హక్కుల గురించి చర్చించక ముందే,1986లో హిందూ వారసత్వ చట్టానికి సవరణ చేసి కుమారులు గడించిన ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా కల్పించిన ఘనత ఎన్టీఆర్‌ది.మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కుటుంబ సంక్షేమం కోసం భద్రత కల్పించారు. నేటికీ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఇంత చైతన్యవంతంగా ఉండటానికి ఆనాడు ఎన్ టి ఆర్ వేసిన పునాదియే కారణం.
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్.మహిళల ఉన్నత విద్యాభ్యాసం కోసం తిరుపతిలో ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి, విద్యారంగంలో విప్లవం తెచ్చారు .రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని భావించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు మొట్టమొదటిసారిగా 9 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారిని శాసనకర్తలు గా మార్చిన దార్శనికత ఎన్ టిఆర్ ది.
మహిళా సంక్షేమానికి ఎన్టీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రాత్మకంగా నిలిచాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, చేయదగిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% వారికే కేటాయించారు.ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థినులకు 33% రిజర్వేషన్ కల్పించారు.ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలకు తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణాల ద్వారా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించారు
ఎన్టీఆర్ హయాంనుంచి నేటి చంద్రబాబు హయాం వరకు మహిళాభివృద్ది కోసం నిరంతర కృషి ఫలితమే నేడుజాతీయ స్థాయి మహిళా రిజర్వేషన్ బిల్లు రూపం దాల్చడం గర్వకారణం. మహిళా నేతృత్వంలోని అభివృద్ధిను సాకారం చేసే ఈ చారిత్రక చట్టం ద్వారా దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతుంది. మహిళల ఆత్మగౌరవాన్ని చట్టబద్ధం చేసిన మహానేత ఎన్ఠీఆర్ కాగా తర్వాత మహిళల ఆర్థిక స్వావలంబనకు దిశానిర్దేశం చేసిన దూరదృష్టి నాయకుడు చంద్రబాబు.
ఈ ఇద్దరి ఆలోచనలు, కార్యాచరణలు ఈరోజు మహిళా సాధికారతకు మూలస్తంభాలుగా నిలిచాయి.ఎన్టీఆర్ కల్పించిన చట్టబద్ధమైన హక్కులకు ఆర్ధిక బలాన్ని జోడించిన వ్యక్తి చంద్రబాబు మహిళలను ఓటు బ్యాంకుగా కాకుండా, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడం ఆయన లక్ష్యం. గడప దాటని మహిళలను సంఘటితం చేసి పొదుపు మంత్రాన్ని నేర్పి ప్రపంచంలోనే అతిపెద్ద స్వయం సహాయక బృందాల వ్యవస్థగా డ్వాక్రాను తీర్చిదిద్ది, ప్రతి మహిళను ఒక ఎంట్రప్రెన్యూర్‌గా మార్చిన వ్యక్తి చంద్రబాబు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, లక్షలాది మంది మహిళలను సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా తీర్చిదిద్ది రాజకీయ ఓనమాలు నేర్పారు, బాలికల జననంపై రూ.5,000 ఫిక్సడ్ డిపాజిట్,దేశంలోనే తొలి మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు.,,మహిళల అక్షరాస్యత 25.27% నుంచి గణనీయంగా పెరిగేలా చర్యలు,మహిళా కమిషన్ ఏర్పాటు,దేశంలోనే తొలి మహిళా స్పీకర్ గా నియామకం, దేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహణ,93 లక్షల మహిళలకు పసుపు-కుంకుమ పథకం,తన తల్లి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ పడుతున్న ఇబ్బందులను చూసిన చంద్రబాబు పొగచూరిన వంటిళ్ల నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించడానికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడారు.
(దీపం-1) పథకం 43 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు (దీపం -2) కింద 1.5 కోట్లకు పైగాఇచ్చారు .(ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ 1,20,000 మంది మహిళలు ప్రజా ప్రతినిధులు.15 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు.అన్న అమృత హస్తం10 లక్షల మహిళలకు పోషకాహారం.తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్ 11 లక్షల మహిళలు లబ్ధి. 2.5 లక్షల బాలికలకు పెళ్లి కానుక, మహిళలకు కండక్టర్లు (5,000+), పోలీసులు (15,000+)మహిళల పేరుమీద ఇళ్లపట్టాలు, భూమి కొనుగోలు, కుట్టు మిషన్లు.ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి): రోజుకు 15–25 లక్షల మహిళలు ఉచితంగా ప్రయాణం తన తల్లి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ పడుతున్న ఇబ్బందులను చూసిన చంద్రబాబు పొగచూరిన వంటిళ్ల నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించడానికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడారు.ఒంటరి మహిళలకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లను భారీగా పెంచి వారికి అండగా నిలిచారు.చంద్రన్నపెళ్లి కానుక పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్పించారు,
మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన దాదాపు 27 ఏళ్ల పాటు వాయిదా పడుతుంది. దేవెగౌడ ప్రభుత్వం 1996లో మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఏకాభిప్రాయం లేక వీగిపోయింది. తర్వాత 1998-1999- 2002- 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ విపక్షాల అభ్యంతరాల వల్ల బిల్లు ఆమోదం పొందలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది.
అయితే లోక్‌సభలో పెండింగ్‌లో పడి, 2014లో లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు కూడా రద్దయింది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 2023లో కొత్త పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 20, 2023న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.ఈ 33 శాతం రిజర్వేషన్ల బిల్లును 16-4-2026 లోక్ సభ లోఆమోదించి 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నది.
అందుకు .ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా బిల్లు అమలుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు, ఎంపీలకు లేఖ రాశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ సవరణలకు పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదని, దేశాభివృద్ధిలో అది ఒక భాగమని ఆయన తెలిపారు.
ఏది ఏమైనా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి, భారతీయ మహిళల రాజకీయ సాధికారతకు బాటలు వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. దేశాభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తించి మీరు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది.మహిళా బిల్లు ఆమోదంతో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తుంది.
– తొండపు దశరధ జనార్దన్
(టిడిపి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు)