– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ: వర్షాలు కారణంగా కొండచరియలు విరిగి పడి క్షతగాత్రులైన వారి ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరామర్శించారు. వారిని పరామర్శించిన సందర్భం లో పురందేశ్వరి చలించి పోయారు. జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న వివరాల పై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.పేషేంట్ అటెండెంట్ లకు కూడా ఆహారం అందించాలని పురందేశ్వరి సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..బెజవాడలో కొండ చరియలు విరిగిపడటం బాధాకరం. కొన్ని దశాబ్దాల తర్వాత భారీ వర్షాలు పడుతున్నాయి. బండరాళ్లు విరిగిపడి గాయాలతో 9 మంది ఆసుపత్రికి వస్తే.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురికి గాయాలయ్యాయి. ప్రభుత్వం కొండ చర్యలు విరిగిపడకుండా చర్యలు చేపట్టాలి. కొండ ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర అధ్యక్షురాలు వెంట బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జి పాతూరి నాగభూషణం, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ,బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ, బిజెపి నేతలు మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, నూతలపాటి బాలకోటేశ్వర రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోగవల్లి శ్రీధర్, మాదాల రమేష్ నేషనల్ కౌన్సిల్ నెంబర్ పసుపులేటి రఘు రాముడు, కార్యదర్శి వేరుకొండ ఉమాకాంత్ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు నరస రాజు తదితరులు పాల్గొన్నారు