Home » ఆర్టీసీ బస్సులు, సిబ్బందిపై దాడులు చేస్తే చర్యలు తప్పవు

ఆర్టీసీ బస్సులు, సిబ్బందిపై దాడులు చేస్తే చర్యలు తప్పవు

-జరిగిన ఘటనలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
-తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
-తిరుమల శ్రీవారి దర్శించుకుని పూజలు

ఆర్టీసీ బస్సులు, సిబ్బందిపై దాడులు చేస్తే చర్యలు తప్పవని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకు న్నారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, ఆర్టీసీ కార్మికులు కూడా బాగుండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 9 నుంచి ఉచిత బస్సు ప్రయాణంలో రోజుకు 50 వేల నుంచి లక్ష మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేశారని వాటి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దాడులు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌రావు, సుధా నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పా ట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు.

Leave a Reply