– నారా భువనేశ్వరి
తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు నా బిడ్డలు…వారు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడేందుకు ఎంత దూరమైనా వెళ్తానని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్త జయప్రకాష్ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించారు.
అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి భువనమ్మ మాట్లాడుతూ… చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలని నా భర్త నన్ను కోరారు.వెంటనే ఏమీ ఆలోచించకుండా నిజం గెలవాలి పేరుతో నా బిడ్డల కుటుంబాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నా. నా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇంటింటికీ ఎలా తిరుగుతావ్…క్లస్టర్ గా ఏర్పాటుచేసి అందర్నీ అక్కడికి పిలిపించి చెక్కులు ఇస్తే సరిపోతుందని నాకు సలహా ఇచ్చారు.
కానీ నా బిడ్డల కుటుంబాలు బాధలో ఉన్నారు..వారిని నేనే నేరుగా వెళ్లి కలిసి..మీకు నేనున్నానంటూ ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీ ముందుకు ధైర్యంగా వచ్చాను. పార్టీ బిడ్డలు నాకు ముందు, వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నారు…నాకు ఇంక భయమేంటి? అరాచక ప్రభుత్వంపై రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో యుద్ధానికి పార్టీ కార్యకర్తలు సై అంటే సై అనేలా రెడీగా ఉండాలి.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ జెండాను ఎగరేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి. ప్రతి కార్యకర్త ఓట్లు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి…ఓటింగ్ పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలి. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో మనం గెలుస్తాం…చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు… అని భువనమ్మ అన్నారు.
టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ
• పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, టేకుమంద గ్రామంలో పార్టీ కార్యకర్త వరిగంటి గోవిందయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 03-10-2023న గుండెపోటుతో మృతిచెందిన గోవిందయ్య.
• గోవిందయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనమ్మ.
• గోవిందయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనమ్మ.
• గోవిందయ్య కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించిన భువనమ్మ.