Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబును చూసి భావోద్వేగానికి గురైన కార్యకర్తలు

-బెయిల్ తీర్పుతో ఆనందోత్సాహాల్లో కార్యకర్తల కేరింతలు
-రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగిన తెలుగుతమ్ముళ్లు

కక్ష సాధింపే లక్ష్యంగా తప్పుడు కేసు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసినా.. ప్రజల్లో చంద్రబాబుకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేరని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు హోరెత్తించారు. దాదాపు 52 రోజుల పాటు జైల్లో నిర్బంధించి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించడం తప్ప ఏమీ సాధించలేరని జగన్ రెడ్డిని హెచ్చరించారు. చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు నివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు భావోద్వేగానికి గురయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి జనసేన కార్యకర్తలు రోడ్డెక్కి ర్యాలీలు నిర్వహించారు. మిఠాయిలు పంచుతూ, బాణ సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

సత్యం, న్యాయం, ధర్మాన్ని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీకి అపజయమనేది లేదు. కుట్రలు కుతంత్రాలను నమ్ముకున్న జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో గుండెల్లో గునపాలు దింపబోతున్నారన్నారు. న్యాయానికి సంకెళ్లు వేయాలనుకునే జగన్ రెడ్డి నియంతృత్వాన్ని సమూలంగా పాతిపెట్టి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటామని నేతలు ప్రతిన పూనారు. చంద్రబాబు బయటకు రావడంతో దేవాలయాల్లో మొక్కలు తీర్చుకున్నారు. చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. రూపాయి అవినీతి లేని కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన జగన్ రెడ్డి, బెయిల్ మంజూరవుతుందని తెలిసి మళ్లీ అరెస్టు చేసేందుకు మద్యంలో అక్రమాలు జరిగాయంటూ కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొనకూడదంటూ పిటిషన్లు వేయడం జగన్ రెడ్డి భయానికి నిదర్శనం. చంద్రబాబును ఎన్నికల వరకు జైల్లో బంధించేందుకు చేసిన కుట్ర అని స్పష్టమైందన్నారు. చంద్రబాబును బంధించాలని ప్రయత్నించి భంగపడ్డ జగన్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నాడు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నేతలు సవాల్ చేశారు.

ఈ సంబరాల్లో పోలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, కాలవ శ్రీనివాసులు, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, గన్ని వీరాంజనేయులు, జ్యోతుల నవీన్, తెనాలి శ్రావణ్ కుమార్, జివి ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, నరసింహా యాదవ్, మల్లెల రాజశేఖర్ గౌడ్, మల్లెల లింగారెడ్డి, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, పి.జి.వి.ఆర్ నాయుడు(గణబాబు), వెగుళ్ళ జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, మాజీ మంత్రులు కిడారి శ్రావణ్ కుమార్, కొండ్రు మురళీ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యరావు, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మినారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

కార్యకర్తల అభిమానం…బాబు అభివాదం
రాజమహేంద్రవరం జైలు నుండి విడుదల అయిన టీడీపీ అధినేత చంద్రబాబును చూసేందుకు వేలాదిగా తరలి వచ్చి ప్రజలు, కార్యకర్తలు అభిమానాన్ని చాటుకున్నారు. 52 రోజుల పాటు జైల్లో ఉండి వచ్చిన చంద్రబాబును చూసేందుకు…ఆయన వచ్చే మార్గంలో ప్రజలు తరలి వచ్చారు. వేలాదిగా వచ్చిన ప్రజలు, కార్యకర్తలకు కారులో నుండే అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు. ప్రతి కూడలిలో భారీ గా జనం తరలిరావడంతో చంద్రబాబు కాన్వాయ్ రాజమహేంద్రవరం నుండి తణుకు రావడానికి నాలుగు గంటల సమయం పట్టింది.

LEAVE A RESPONSE