సీతారాముల కళ్యాణము చూతము రారండి..
ఆణిముత్యాలనే తలంబ్రాలుగా
జల్లిన ఆ చేతులు
తదనంతర కాలంలో
విస్కీ గ్లాసు పట్టి..
వ్యసనానికి తలొగ్గి
గ్లామర్ తగ్గి..
గ్రామర్ పోయి
తెరమరుగై..
చిన్న వయసులోనే
హరీ అన్న హరనాథ్..
వెండి తెరపై
అందమైన వెన్నెల సంతకం..!
రామారావే సినిమా రాముడైతే
అంతటి ఎన్టీఆరే ఏరి కోరి
మెచ్చిన కళ్యాణ రాముడు..
పెద్దాయన కురువృద్ధుడై
భీష్ముడిగా మారిపోతే
మరి అందాల కృష్ణుడెవరు..
సమ్మోహన దరహాసంతో
అదే హరనాథ్..!
భక్తప్రహ్లాదుడు చిన్నారి
రోజారమణిని
రెండు చేతులా
ఎత్తుకున్న హరి హరనాథ్..
రంగుల్లో మెరిస్తే
ప్రేక్షక లోకం మురిసింది!
వాణిశ్రీని మొల్లగా మనువాడి
న్యాయం చేసి..
చిట్టిచెల్లెలులో తీరని గాయం చేసాడీ హర”నాథుడు”..!
హరనాధుకు సరైన జోడీ
అందమైన జమునేగా
ఆ లేడీ..
ఇద్దరివీ లేతమనసులై
అందాల ఓ చిలుకా
అందుకో నా లేఖా
గడ్డిమోపెడంత ప్రేమ
జి వరమ్మ కుట్రతో..
గీతాంజలి పుట్రతో..
విడాకుల్లేకుండానే విడిపోయింది..!
అంతకుముందే
నాదీ ఆడజన్మే లో ఇద్దరూ తన్మయంలో పడిపోయారు!
మొత్తానికి వ్యసనం
కూల్చేసింది
హరనాధ్ సింహాసనం..!
ముందు ఆయ”నొచ్చినా”
మందు కారణంగా వెనకబడితే
కృష్ణ,శోభన్..కృష్ణంరాజు
కొట్టేశారు స్టార్ డమ్..
ఆరడుగుల అందగాడికి
పట్టేసింది చావు సిండ్రోమ్..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286