– రష్యా నుంచి పెట్రోల్ దిగుమతుల్లో ఎక్కువ శాతం ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీ దిగుమతి
– దిగుమతి చేసుకున్న పెట్రోల్ ను అంబానీ ఐరోపా దేశాలకు ఎగుమతి చేసి లక్షా 50 వేల కోట్ల రూపాయలను సంపాదించారు
– పదకొండేళ్లలో పెట్రో ఉత్పత్తుల పై ప్రతి కుటుంబం నుంచి సగటున లక్ష రూపాయలపైనే పన్ను రూపం లో వసూలు
– కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాలు రద్దు చేసింది
– బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం అమెరికా భారత్ పై 50 శాతం టారిఫ్ విధించింది. రష్యా నుంచి భారత్ పెద్దఎత్తున ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి మేము 50 శాతం టారిఫ్ విధిస్తున్నామని అమెరికా అంటోంది. దీంతో టెక్స్ టైల్ రంగం, మాన్యుఫాక్చరింగ్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికా 50 శాతం టారిఫ్ తో పెద్ద ఎత్తున భారత్ పై భారం పడబోతుంది.
రష్యాపై అమెరికా,యూరోపియన్ యూనియన్ నిషేధం విధించాయి. రష్యా భారత్ కు పెట్రోల్ దిగుమతుల్లో డిస్కౌంట్ ఇచ్చింది. రష్యా నుంచి ఇండియాకు పెట్రోల్ దిగుమతులు ఒక్క శాతం నుంచి 40 శాతానికి పెరిగాయి. రష్యా నుంచి పెట్రోల్ దిగుమతుల్లో ఎక్కువ శాతం ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీ దిగుమతి చేసుకుంటుంది.
దిగుమతి చేసుకున్న పెట్రోల్ ను అంబానీ ఐరోపా దేశాలకు ఎగుమతి చేసి లక్షా 50 వేల కోట్ల రూపాయలను ఇప్పటి దాకా సంపాదించారు. మేకిన్ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ఊదరగొడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయకుండా అంబానీ,అదానీలకు దోచిపెడుతుంది. మోడీ ప్రభుత్వం విధానాలతో రూపాయి విలువ పడిపోయే అవకాశం ఉంది.
రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 88 రూపాయలకు చేరింది. ఢిల్లీలో మోదీ అసమర్థత ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అమెరికా సుంకాలు విధించడంతో దేశ ప్రజలపై మోదీ 5 లక్షల కోట్ల భారం మోపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత అంతర్జాతీయ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 107 డాలర్లు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర 47 డాలర్లకు చేరింది.
అయినా పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గలేదు. పదకొండేళ్ల లో మోడీ ప్రభుత్వం పెట్రోల్ పై పన్ను ద్వారా 40 లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది. అయినా పేద ప్రజలకు ఉపయోగ పడే పని ఒక్కటి చేయలేదు. ప్రపంచంలో పెట్రోల్ ధర ఎక్కువ గా ఉన్న దేశం ఇండియా మాత్రమే. ఎల్ పి జి సిలిండర్ ధర విషయం లో భారత్ ప్రపంచం లో మూడో స్థానం లో ఉంది. .
మోడీ పదకొండేళ్లలో పెట్రో ఉత్పత్తుల పై ప్రతి కుటుంబం నుంచి సగటున లక్ష రూపాయలపైనే పన్ను రూపం లో వసూలు చేశారు. కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాలు రద్దు చేసింది. రైతులకు రుణ మాఫీ కూడా చేయ లేదు .పైగా నల్ల చట్టాలతో రైతులను మోడీ ఇబ్బంది పెట్టాలని చేశారు .
పేదలను కొట్టి పెద్దలకు పంచాలనే విధానం తో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఏపీ పునర్విభజన చట్టాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు?తెలంగాణలో కాంగ్రెస్ 8 ఎంపీలు బీజేపీ 8 ఎంపీలు జీరో అయ్యారు. తెలంగాణకు కేంద్రం అదనంగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన చట్టంలో ఉన్న హామీ ఒక్కటి నెరవేర్చలేదు.
లక్నో మెట్రో కు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో కు నిధులు కేటాయించడం లేదు .
రాజ్యాంగ బద్దంగా రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు తప్పిస్తే ఒక్క పైసా తెలంగాణ కు అదనంగా కేటాయించలేదు. దమ్ముంటే బీజేపీ నాయకులు కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధుల పై మాతో చర్చకు రావాలి. కార్పొరేట్ గద్దలకు దోచి పెట్టడమే బీజేపీ ప్రభుత్వ పని గా మారింది. రష్యా నుంచి పెట్రోల్ చవకగా కొనడం వల్ల ప్రజలకు ఉపయోగం లేకపోగా అమెరికా సుంకాలతో దేశ ప్రజలపై భారం పడబోతోంది.