Suryaa.co.in

Andhra Pradesh

ఆదిమూలపు సురేష్..ఖబడ్దార్ !

-ఆదిమూలపు సురేష్ సంగతేంటో తేలుస్తాం
-రాష్ట్రంలో దళితుల్ని చంపేస్తుంటే మంత్రి సురేష్ ఎక్కడ దాక్కున్నాడు
-ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే జగన్ ఒక్కరికే అమ్మఒడి ఇస్తున్నాడు
-ఎర్రగొండపాలెం బహిరంగ సభలో చంద్రబాబు

ఎర్రగొండపాలెంలో మూలాలు లేని మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నాడు. ఎర్రగొండపాలెం రాకుండా నన్ను అడ్డుకోవాలని సురేష్ ప్రయత్నించాడు. ఆదిమూలపు సురేష్ సంగతేంటో తేలుస్తాం. ఖబడ్దార్ ఆదిమూలపు సురేష్.ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్ ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎర్రగొండపాలెం లో అసైన్డ్ భూములు మంత్రి సురేష్, అతని బంధువు ఆక్రమించారు. మంత్రి ఆక్రమించిన భూములపై ట్రిబునల్ వేసి పేదలకు తిరిగి అప్పగిస్తా.ఎర్రగొండపాలెం లో తాగు నీటి సమస్య ఉంది…ప్రతి గ్రామానికీ కృష్ణా నీళ్లు తీసుకువస్తాం. రాష్ట్రంలో దళితుల్ని చంపేస్తుంటే మంత్రి సురేష్ ఎక్కడ దాక్కున్నాడు.దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ ఎరిక్షన్ బాబు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాడు. ఆదిమూలపు సురేష్ కి ఎర్రగొండపాలెంతో తిరిగి పోటీ చేసే ధైర్యం ఉందా. ఆదిమూలపు సురేష్ ని శాశ్వతంగా ఇంటికి పంపాలి.

జగన్ ని వదిలించుకుంటే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ లేదు. జగన్ ఇచ్చేది 10 రూపాయలు…దోచుకునేది 100 రూపాయలు.ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే జగన్ ఒక్కరికే అమ్మఒడి ఇస్తున్నాడు.అమ్మ ఒడి రాని మిగిలిన పిల్లలు కూలి పనులకు వెళ్లాలా…చిన్నారులకు బంగారు భవిష్యత్ చూపించే బాధ్యత నాది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు నొక్కి వైఎస్ రాజశేఖరరెడ్డి నాశనం చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన శని జగన్.టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం, నదుల అనుసంధానం, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి.వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వడం టీడీపీకే సాధ్యం.

మూలాలు లేని ఆదిమూలం, జగన్ మార్కాపురం జిల్లా ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం.రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం ఏలుతోంది.మోసపోయి భస్మాసురుడు జగన్ కి ఓట్లు వేశారు..ఆ భస్మాసురుడు మీనెత్తి మీదే చేతులు పెడుతున్నాడు. దేశ వ్యాప్తంగా సరఫరా అవుతున్న గంజాయికి ఏపి కేంద్రంగా మారింది.నాసి రకం మద్యం అమ్మి ప్రజల్ని దోచుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకు పోలీసుల్ని అడ్డు పెట్టుకున్నారు…ఇప్పుడు రౌడీలే రోడ్లపైకి వస్తున్నారు. నా దగ్గర కుప్పి గంతులు వేయాలని ఆదిమూలపు సురేష్ వచ్చాడు. జగన్ కోర్టులకు కూడా సవాల్ గా మారాడు. ముగ్గురు ఎంపిలను పైరవీల కోసం పెట్టుకున్నాడు. కోడి కత్తి డ్రామా అడిన కమల్ హాసన్ జగన్.

LEAVE A RESPONSE