Suryaa.co.in

Andhra Pradesh

పెయింటింగ్ లో గిన్నెస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆదిపూడి దేవిశ్రీ

ప్రకాశం జిల్లా ఒంగోలు కాఫీ పొడితో 156.5 చదరపు మీటర్ల సైజలో 33 గంటలలో వేసిన గాంధీజీ చిత్రానికి ప్రపంచములోనే గుర్తింపు లభించినట్లు సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సoధర్భముగా ఆదిపూడి దేవిశ్రీ ని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఘనంగా అభినందించి గిన్నెస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ను, గోల్డ్ మెడల్ ను అందించి ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మంచి చిత్రకారిణిగా రాణిoచాలని తెలిపారు. ఈ సoధర్భముగా రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు కుడా అభినందనలు తెలియ చేశారు. పలువురు చిత్రకారులు మరియు తూనుగుంట నాగమణి, హ్యూమన్ రైట్స్ ప్రతినిధి టి. భాను చందర్, నక్క. మహేష్, దారా . ధనుష్, సింగమనేని. సురేష్, ఇంకా పలువురు చిత్రకారులు, పలు సాహిత్య సంస్థలు అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE