Suryaa.co.in

Andhra Pradesh

నామినేషన్ దాఖలు చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌

– వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
– 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తా
– రాష్ట్రంలో కూటమిదే అధికారం
– రాజమండ్రి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా తిలక్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్ధనలు చేసి కూటమి నాయకులు, కార్యకర్త లు, అభిమానుల మధ్య భారీ జన సందోహంతో తిలక్‌ రోడ్డు సాయిబాబా మందిరం దగ్గర నుంచి భారీ ర్యాలీగా శ్యామలానగర్‌, గోరక్షణపేట, జాంపేట, దేవీచౌక్‌ మీదుగా గోకవరం బస్టాండ్‌ సమీపంలోని నగర పాలక సంస్థ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆదిరెడ్డి భవానీ కూడా నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళ మేయర్‌ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి పురం ధేశ్వరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంకు మాజీ చైర్మన్‌ చల్లా శంకరరావు పాల్గొన్నారు.

50 వేల మెజార్టీతో గెలుస్తా: ఆదిరెడ్డి
రాజమండ్రి చరిత్రలో ఎన్నడు లేని విధంగా తన నామినేషన్‌ కార్యక్రమం జరిగిందని, 50 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించబోతున్నానని ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. మద్యపానం నిషేధం అంటూ చెత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీశారని ఇంకా ఏ మొఖం పెట్టుకుని రాజమండ్రి వస్తున్నారు జగన్‌ అని ప్రశ్నించారు. వస్తే వచ్చారు కానీ, మా భరత్‌ రామ్‌ వద్ద ఏం లేదు… చాలా పేద వాడు అనే మాటలు చెప్పొద్దని సూచించారు. ఇక్కడి రీల్స్‌ స్టార్‌ చేసిన అవినీతి తెలిసి కూడా అవే పదాలు వాడొద్దంటూ హితవు పలికారు. అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE