Suryaa.co.in

Features

అనురాగపు అలికిడి

సరిగమలతో
సావాసం చేసి
నా మనసు నేర్చుకుంది
ప్రేమ తాళం…!!

అక్షరాలను
ఆలింగనం చేసుకొని
నా తనువు జపించింది
మాటల మంత్రం…!!

జతులతో
పరుగులు తీస్తూ
నా ఆణువణువు చేస్తుంది
ఆనంద తాండవం…!!

కౌగిలింతల హాయిలో
నును సిగ్గుని దాచుకొనేలా
కంటి పాపలు కోరుకునే
కొంటె కలలు ఇవన్నీ…!!

పులకింతల పూజలో
సోయాగాల మల్లెలతో
అభిషేకించేలా
ఎదలో కదలాడే
“అనురాగపు అలికిడి” ఇదంతా…!!

నలిగల రాధికా రత్న.

 

LEAVE A RESPONSE