– ఎంపీ విజయసాయిరెడ్డి
2024 ఎన్నికల తర్వాత నిత్యానందలా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీవులు చూసుకుంటే బాగుంటుందని వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు, విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలయిందంటూ, శ్రీలంక అయిపోతుందని తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఆర్టిస్టులు డూపులు గ్రూపు డాన్సర్లు వాంప్‌ల చేత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. రాష్ట్రం శ్రీలంక కాదు గాని, మీ నారా అల్జిమర్స్ నాయుడు మాత్రం 2024 ఎన్నికల తర్వాత గొటభాయ్ కావడం ఖాయమని ఆయన చెప్పారు. నిత్యానందలా దీవులను చూసుకొని చంద్రబాబు నాయుడు రాష్ట్రం నుండి వెళ్లిపోవాల్సిందేనన్నారు. కరకట్టును నమ్ముకుంటే ఖతమే అని ట్వీట్ చేశారు.