Suryaa.co.in

Andhra Pradesh

క్యాసినోలకు వెళ్తా..పేకాట ఆడతా, ఆ ప్రవీణ్ ఎవరో తెలియదు

– ‘చికోటి’ వ్యవహారంపై బాలినేని స్పందన

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్ వ్యవహారంపై వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఒంగోలు లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి బాలినేని విలేకరులతో మాట్లాడుతూ తాను ఎప్పుడైనా క్యాసినోకు వెళ్తానని.. పేకాట ఆడతానని, . అయితే చికోటి ప్రవీణ్ కానీ.. హవాలా వ్యవహరాలతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

చికోటి ప్రవీణ్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ తనకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. తాను ఎప్పుడైనా

క్యాసినోకు వెళ్తానని.. పేకాట ఆడతానని బాలినేని తెలిపారు. అయితే చికోటి ప్రవీణ్ కానీ.. హవాలా వ్యవహరాలతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఉన్న విషయాలు ఒప్పుకుంటానని.. డ్రామాలు చేయడం తనకు రాదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తనకు ప్రవీణ్ సంబంధాలు వున్నాయని భావిస్తే ఎవరైనా విచారణ చేయొచ్చని బాలినేని స్పష్టం చేశారు. కావాలని టీవీలు, పేపర్లలో తన పేరు బయటకు తీసుకొస్తే మంచి పద్ధతి కాదన్నారు.

మరోవైపు.. చికోటి ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. దాదాపు 20 గంటల పాటు అతని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రవీణ్ తో పాటు మాధవ రెడ్డి నివాసంలో కూడా ఎన్ఫోరసెమెంట్ డైరెక్టరేట్, అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డిలను విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.

LEAVE A RESPONSE