Suryaa.co.in

Andhra Pradesh

ఏజీ శ్రీరామ్ న్యాయస్థానాల్నే తప్పుదోవ పట్టించే దుస్థితికి దిగజారాడు

• ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ.. న్యాయస్థానాల్లో నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నందుకు శ్రీరామ్ నిజంగా సిగ్గుపడాలి
• జగన్ రెడ్డి ఇసుక దోపిడీతో నదులే ప్రవాహదిశను మార్చుకొని తీరం వెంబడి ఇళ్లు..పొలాలను ముంచేస్తున్నాయి
– టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

రాష్ట్రంలోని సహజ వనరుల్నీ దారుణంగా దోచేస్తున్న జగన్ రెడ్డి అతని ప్రభుత్వం … తుఫాన్ వల్ల సర్వంకోల్పోయిన రైతుల కన్నీళ్లు తుడవడానికి మీనమేషాలు లెక్కిస్తోందని, ప్రజలంతా అన్నం వంటి ఆహారపదార్థాలతో కడుపు నింపుకుంటుంటే, ఈ ముఖ్యమంత్రి అతని దొంగల ముఠా మాత్రం ఇసుకను స్వాహాచేస్తూ వేలకోట్లు దోచేస్తోందని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను జగన్ రెడ్డి.. అతని ఇసుక మాఫియా దారుణంగా తవ్వేస్తోంది. అక్రమంగా ఇసుకను పక్కరాష్ట్రాలకు తరలించి నాలుగేళ్లలోనే జగన్ రెడ్డి రూ.40వేలకోట్లు దోచేశాడు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు ఇచ్చిన టెండర్ కాలపరిమితి ముగిశాక కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తోంది. కృష్ణా నదీ సహా.. ప్రధాన నదీగర్భాల్లోని ఇసుకను దోచేస్తున్నారని కొందరు పర్యావరణ పరిరక్షకులు ప్రభుత్వంపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) లోఫిర్యాదు చేశారు.

ఎన్జీటీ ఆ ఫిర్యాదులపై విచారణ జరుపు తున్నా కూడా ఆపకుండా ఏపీ ప్రభుత్వ కనుసన్నల్లో ఇసుకదోపిడీ కొనసాగుతూ నే ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేత్రత్వంలో సాగుతున్న ఇసుక తవ్వ కాలపై ఎన్జీటీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జేపీ పవర్ వెంచర్స్ ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇసుక తవ్వకాలు.. ప్రభు త్వానికి వచ్చిన ఆదాయం వంటి వివరాలు ఏవీ జగన్ రెడ్డి సర్కార్ ప్రజల ముం దు ఉంచలేదు. ఏపీ ప్రభుత్వమే తమకు బకాయి ఉందని.. జగనన్న కాలనీల్లో మట్టి తోలిన తాలూకా తమకు బకాయిలు చెల్లించాలని జేపీ సంస్థ చెబుతోంది.

6 నెలలుగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరగడం లేదన్న ఏజీ శ్రీరామ్ వ్యాఖ్యలు పచ్చిఅబద్ధం
రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరపడానికి వీల్లేదని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కార్ ధిక్కరించడం ముమ్మాటికీ చట్టాన్ని అతిక్రమించడమే . జేపీ పవర్ వెంచర్స్ కు ప్రభుత్వం ఇచ్చిన టెండర్ గడువు మే నెలతో ముగిసిం ది. అప్పటినుంచీ రాష్ట్రంలో ప్రభుత్వమే ఇసుకతవ్వకాలు.. రవాణా.. అమ్మకాలు యథేచ్ఛగా జరుపుతోంది. ఈ 6 నెలల నుంచీ రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. అడ్వకేట్ జనరల్ ఎల్.శ్రీరామ్ రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదని ఏపీ హైకోర్టులో పచ్చి అబద్ధాలు చెబుతూ.. న్యాయవాద వృత్తికే కళంకం తీసుకొచ్చాడు.

ప్రజల సొమ్ము జీతంగా తీసుకుం టూ.. నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నందుకు శ్రీరామ్ నిజంగా సిగ్గుపడాలి. ఆయన రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను పరిశీలిస్తే.. అక్కడ ఎలాంటి దారుణమైన పరిస్థితు లు ఉన్నాయో కళ్లకు కనిపిస్తుంది. ఎటువంటి ఎన్.వో.సీలు లేకుండానే వైసీపీ ఇసుకాసురులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. జగన్ రెడ్డి.. అతని ఇసుకమాఫియా దోపిడీ దెబ్బతకు పెద్దపెద్ద నదులు కూడా వాటి ప్రవాహ మార్గాన్ని మార్చుకొని తీరం వెంబడి ఉన్న ఇళ్లు , పొలాలను ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది. నదీతీరాల్లో ఇసుక మాఫియా తవ్విన భారీ గోతుల్లో పడి అనేక చోట్ల పశువులు.. మనుషులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

టీడీపీ ప్రభుత్వం రాగానే జగన్ రెడ్డి ఇసుక దోపిడీ లెక్కలు తేల్చి.. తిన్నదంతా కక్కిస్తాం
ప్రకృతి సంపద అయిన ఇసుకను అడ్డగోలుగా దోచేస్తూ.. సిగ్గులేకుండా ఇంకా న్యాయస్థానాల్లో అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డి.. అతని దోపిడీ ప్రభుత్వానికే చెల్లింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి ఇసుక మాఫియా దోపిడీ లెక్కలు తేల్చి..ఆయన దోచిందంతా కక్కిస్తాం. ఇసుక దోపిడీలో మునిగి తేలుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. మంత్రులందర్ని ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ లారీలు కొని మరీ అర్థరాత్రిళ్లు కూడా ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నాడు. అడ్డూ అదుపూ లేకుండా సాగిస్తున్న ఇసుకదోపిడీపై జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.” అని మాణిక్యరావు స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE