Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ సర్కారు ఓట్ల అవకతవలకు పాల్పడుతోంది

– రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన తెదేపా నేత చంద్రబాబు నాయుడు

ఏపీ సీఎం జగన్‌ ఆధ్వర్యంలోని వైసీపీ సర్కారు ఓట్ల అవకవకలకు పాల్పడుతోందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ మేరకు ఆయన తన వద్ద ఉన్న ఆధారాలను ఎన్నికల అధికారికి లేఖ రూపంలో అందించారు. చంద్రబాబు ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ..

• రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోంది.
• ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదు.
• మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి.
• కానీ, ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తించబడుతూనే ఉన్నాయి.
• ఇంటింటి సర్వేలో బాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగించాలి.
• కానీ, దురదృష్టవశాత్తు డ్రాప్ట్ ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి.
• రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ – 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
• అర్హత లేని వారికి సైతం ఫామ్ – 6 ద్వారా ఆన్‌లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు.
• అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. వీటిపై మా అభ్యంతరాలపై నేటికి దృష్టిపెట్టలేదు.
• డైరెక్ట్‌ గా గానీ, ఆన్‌లైన్‌లో గానీ బల్క్ ఫామ్-7 ధరఖాస్తులను స్వీకరించరాదు.
• ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి.
• కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారు.
• నేటికి ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
• ఓట్లు మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సంధర్బంగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
• డ్రాప్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా పైన పేర్కొన అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
• ఫైనల్ లిస్తులో ఓట్ల అవకతవకలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
• దీనికి సంబంధించి ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయం కల్లా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయగలరు.

LEAVE A RESPONSE