Suryaa.co.in

Andhra Pradesh

మున్సిపాలిటీలో గ్రామాల వీలీనంకు వ్యతిరేకం…

– కురగల్లు, నీరుకొండ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
– గ్రామసభలలో మార్మోగిన జై అమరావతి నినాదం

రాజధాని ప్రాంతంలో 22 గ్రామాలను అమరావతి మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ముందడుగు వేసిన ప్రభుత్వం కు అయా గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత ఎదురౌతుంది.. అమరావతి రాజధాని గ్రామాలు 29 ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత, రాజధాని గ్రామాలైన తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి మండలం నిడమర్రు, బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్ద పరిధిలోకి తీసుకువచ్చారు.

అయా గ్రామాలు మున్సిపాలిటీలో విలీనంపై గ్రామస్తులు హైకోర్టును అశ్రయించారు. ఈ వివాదం హైకోర్టు లో నడుస్తుండగా… తుళ్లురు మండలంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలం లోని నీరుకొండ, కురగల్లు, కృష్ణాయపాలెం గ్రామాలను కలుపుతూ అమరావతి మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

దీనిలో భాగంగా అయా గ్రామాలలో గ్రామ సభలను నిర్వహిస్తున్నారు.గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి మండలం కురగల్లు గ్రామం సచివాలయం వద్ద మంగళగిరి ఎంపిడివో రామ్ ప్రసన్న ఆధ్వర్యంలో మంగళగిరి వ్యవసాయశాఖ, మరియు కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రత్యేక అధికారిణి, జెడ్ శైలజారాణి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. 44 మంది వ్యతిరేకిస్తూ చేతులు పైకి ఎత్తారు. గ్రామ సభలో అమరావతి విలీనంను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానంకు అమోదం తెలిపారు… కార్యక్రమంలో గ్రామస్తులు తోట పార్దసారధి, అర్దల రామరాజు, గుడారి గోపాలరావు తదితరులు పాల్గోన్నారు.

నీరుకొండ లో…
రాజధాని గ్రామామైన నీరుకొండ సచివాలయం వద్ద గురువారం సాయంత్రం జరిగిన గ్రామ సభలో అమరావతి మున్సిపాలిటీలో విలీనంను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు తీర్మానం చేశారు.12 అంశాలతో కూడిన అభ్యంతర లేఖను ఎంపిడివో రామ్ ప్రసన్న, ప్రత్యేక అధికారిని జెడ్ శైలజారాణి కి గ్రామస్తుల తరుపున ముప్పావరపు కృష్ణారావు లేఖను అందచేశారు.

74 మంది గ్రామస్తులు అమరావతి మున్సిపాలిటీలో నీరుకొండ గ్రామాన్ని విలీనంను వ్యతిరేకిస్తూ చేతులు పైకి ఎత్తి జై అమరావతి నినాదాలు చేశారు…కార్యక్రమంలో ఈవోపిఆర్డీ శ్రీనివాస్ నాయక్, కురగల్లు, నీరుకొండ ఇన్ చార్జ్ సెక్రటరీ పి ఆదినారాయణ, గ్రామస్తులు మాదల నరేంద్రబాబు తదితరులు పాల్గోన్నారు.

LEAVE A RESPONSE