Suryaa.co.in

Andhra Pradesh

పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి 5 ఏళ్లకు పెంచాలి

– ఏటా 6500 పోలీసు ఉద్యోగాల భర్తీ అని మూడున్నరేళ్ల తర్వాత కేవలం 6500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సిగ్గుచేటు
– టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాణం ప్రణవ్ గోపాల్

అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ అన్న జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి విద్యార్ది, యువతను నిలువునా మోసం చేశారు. ప్రతి ఏటా 6500 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఏటా 6500 ఉద్యోగాల చొప్పున మూడేళ్లలోనే 19,500 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది.

కానీ మూడున్నరేళ్ల తర్వాత కేవలం 6,511 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల ఆశలపై నీల్లు చల్లారు. గత మూడున్నరేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవటంతో ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ కి లక్షలాది మంది ధరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారు.

జూలై 2 – 1993 తర్వాత పుట్టి ఉండాలన్న నిభంధనతో ఒక్క రోజు, వారం, నెల రోజుల వ్యవధిలోనే లక్షలాదిమంది అభ్యర్ధులు అర్హత సాధించలేకున్నారు. అభ్యర్ధుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వయోపరిమితి 5 ఏళ్లకు పెంచాలి. జగన్ రెడ్డి చెప్పిన హామీ ప్రకారం మూడేళ్లలో భర్తీ చేయాల్సిన 19,500 పోలీసు ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.

LEAVE A RESPONSE