Suryaa.co.in

Andhra Pradesh

పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో అఘోరి మాత!

అమరావతి: పిఠాపురం పాదగయా క్షేత్రంలో నాగ సాధు మహిళ అఘోర హల్చల్ చేశారు. మొన్నటిదాకా తెలంగాణలో… రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్రలో పర్యటించిన నాగ సాధు అఘోరి అకస్మాత్తుగా పిఠాపురంలో ప్రత్యక్షమయ్యారు. అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకున్న అఘోరి మాత. పిఠాపురం పాదగయా క్షేత్రంలో ఉమా రాజరాజేశ్వరి కుక్కుటేశ్వర స్వామి వారిని, అష్టాదశ శక్తి పీఠాల్లో పదోవ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారిని, స్వయంభూవుడైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. సనాతన ధర్మం, మహిళలు రక్షణ కోసం ఇలా పర్యటిస్తున్నట్టు మీడియాకు తెలిపారు. పూజల అనంతరం కాకినాడ శ్రీ పీఠం సంస్థానానికి ఆ గౌరీ మాత బయలుదేరి వెళ్ళారు.

LEAVE A RESPONSE