-
హర్షం వ్యక్తం చేసిన అర్చక, బ్రాహ్మణ సంఘాలు
-
అర్చకులు అండగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,లోకేష్
-
నాలుగు నెలల్లో నాలుగు జీవోలు ఇచ్చి “ఇది మంచి ప్రభుత్వం” అనిపించుకున్న ఎన్డీఏ కూటమి..
-
అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం..
అమరావతి: దేవాదాయ శాఖలో పనిచేసే అర్చకులకు 15,000 రూ.లు జీతం పెంచుతూ ఇచ్చిన జీవోపై బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అర్చక సంఘాలు గుంటూరులో హర్షం వ్యక్తం చేసాయి. ఈ సందర్భంగా గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక జేఏసీ నాయకులు జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ…..
రాష్ట్రంలో చాలామంది అర్చక కుటుంబాలు కేవలం 5000 రూ.ల జీతానికి పనిచేస్తున్న వైపరీత్యం ఈ రాష్ట్రంలో నెలకొని ఉందని, సమాజంలో ఒక మనిషి కుటుంబం గడవాలంటే, పిల్లల చదువులు కానీ, ఇంటి అద్దెలు గాని, హాస్పిటల్ ఖర్చులు గాని, నిత్యవసర సరుకులకు కానీ కనీసం బొటాబోటిన కనీసం 30,000 రూ. లు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో మాత్రమే జీవన విధానం ఉందని, అర్చకులు మాత్రం తాము బతికి బతకలేక జీవనం సాగిస్తు, నిత్యం దేవుని సేవలో తరించే అర్చకులకు 15,000రూ.లు పెంచుతూ ఇచ్చిన ప్రభుత్వ జీవో వల్ల చాలామంది అర్చక కుటుంబాల్లో కొంతలో కొంత అయినా వెలుగులు, ఆనందం వ్యక్తం చేసే పరిస్థితులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డాయని హర్షం వ్యక్తం చేశారు.
గత జగన్ ప్రభుత్వం మాత్రం అర్చకుల సమస్యలపై ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవని, కేవలం 3,000, 5,000 రూ.లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, గత ప్రభుత్వంలో దేవాలయాల్లో దేవుని ముందే అర్చకులు పైన దాడులు జరుగుతున్న,రథాలు తగలబెట్టిన,దేవతా విగ్రహాలు భిన్నం చేసినా సరే కనీసం జగన్ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కూడా లేవని జగన్ ప్రభుత్వం అర్చక బ్రాహ్మణ వ్యతిరేక వ్యవహారాలు రాష్ట్రంలో చేసిందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల మేనిఫెస్టోలో టిడిపి బిజెపి జనసేన పార్టీలు కలసి అర్చకుల సమస్యలపై , బ్రాహ్మణుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, మేనిఫెస్టోలో పెట్టిన వివిధ అంశాల్లో ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల్లో 4అంశాలకు గాను నాలుగో జీవోలు ఇస్తూ వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టటం పై అర్చక, బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. అలానే ప్రైవేట్ దేవాలయాల్లో కూడా కనీస జీతాలు లేకుండా, కుటుంబం గడవని స్థితిలో చాలామంది అర్చకులు ఉన్నారని వారికి కూడా దేవాదాయ శాఖ లేదా ప్రభుత్వం ద్వారా మేలు చేసే ప్రక్రియలు ఈ ప్రభుత్వం త్వరితగతిన చేపట్టాలని అభిలషలించారు.
మొదటి జీవో ప్రైవేటు దేవదాయ శాఖ ఖర్చులకు 15,000 రూ.లు ఇస్తామని తెలియజేయటం, రెండో జీవోలో దేవాలయాల్లో జరిగే ఆగమ విధానాలు, కైంకర్యాలు, సాంప్రదాయాలు తదితర అంశాల్లో ఎండోమెంట్ అధికారులు, పాలక మండళ్ళు పెత్తనం లేకుండా, జోక్యం చేసుకోకుండా జీవో ఇవ్వడం జరిగిందని, మూడో జీవో గా ధూప దీప నైవేద్య పథకం కింద ఇబ్బందులు ఎదుర్కొనే దేవాలయాల్లో పదివేల రూపాయలు, రిటైర్ అయిన వేద పండితులకు 3000 రూపాయలు జీవనభృతుని అందజేస్తూ జీవో ఇవ్వటం జరిగిందని, నాలుగో జీవో 50 వేల రూపాయల పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాల అర్చకులకు 15,000 రూ.లు ప్రకటిస్తూ జీవో ఇవ్వటం జరిగిందని చెప్పారు.
ఓటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడిచిన సందర్భంలో అర్చకులకు అండదండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని చంద్రబాబు నాయుడు అర్చక బంధువుగా మారారని, ఇలానే గత చంద్రబాబు ప్రభుత్వంలో వంశపారంపర్య అర్చకులకు విధివిధానాలను రూపొందించే జీవో 76 ను పునరుద్ధరించి రూల్స్ అమలయ్యేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మాత్యులు కృషి చేయాలని ఎన్నో ఏళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారిన సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ రూల్స్ ని రూపొందించకుండా తాత్సారం చేస్తున్నారని , ఇప్పటికైనా కూటమి ప్రభుత్వాధినేతలు దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దేవాలయాల్లో పనిచేసే అర్చకులు కూటమి ప్రభుత్వం పేరు మీద, చంద్రబాబు నాయుడు, కొణిదల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఆనం రామనారాయణరెడ్డి పేర్లతో వారి కుటుంబ సభ్యుల పేర్లతో నిత్య పూజలు చేయవలసిందిగా శ్రీధర్ శర్మ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బృందావనం గోపిచంద్, యనమదల ఆంజనేయులు, ఐలూరి శ్రీనివాస్, వినోద్ శర్మ,చిలుమూరి గిరి వేదాంతం లక్ష్మణ్, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వంగవీటి చైతన్య, వడ్డమాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.