– దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా తెలంగాణ
– మూడు లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు…
– పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యం
– ఎకో…డిజిటల్ స్మార్ట్ సాగు దిశగా తెలంగాణ
– సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు రాజ్యం
– గ్లోబల్ సమ్మిట్ లో మంత్రి తుమ్మల
– గోద్రెజ్ కంపెనీ ఎం.డి రాకేష్ స్వామి తో మంత్రి తుమ్మల భేటీ
– గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మంత్రి తుమ్మల తో భేటీలో పాల్గొన్న గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సీ.ఈ.ఓ సౌగత్ నియోగి…ఆయిల్ ఫామ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ చావా వెంకటేశ్వర రావు…కార్పొరేట్ అఫైర్స్ మీషికా నాయర్
– ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ పురోగతి పై సమీక్ష
హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు మంత్రి తుమ్మల తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంత్రి తుమ్మల వివరించారు.
తెలంగాణ ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయ రంగమే గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని మంత్రి తుమ్మల విజన్ డాక్యుమెంట్ పై ప్రజెంటేషన్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు ఏళ్ళలో లక్ష కోట్ల రూపాయలు రైతాంగం సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్లు వివరించారు.
ఆయిల్ ఫామ్ విస్తరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు వివరించారు.ప్రస్తుతం మూడు లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు ఉండగా పది లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ప్రభుత్వం ఉందన్నారు.
రైతులకు దీర్ఘకాలం లాభాలు ఉండేలా పామాయిల్ సాగు విస్తరణ చేపట్టినట్లు తద్వారా గ్రీన్ కవర్ పెరగటంతో పాటు పర్యావరణ హితంగా పామాయిల్ సాగు గేమ్ చేంజర్ గా మారుతుందని మంత్రి తుమ్మల విజన్ డాక్యుమెంట్ వివరించారు.
తెలంగాణ ఆర్ధిక రంగంలో వ్యవసాయ రంగం దాని అనుబంధ ఆర్ధిక వ్యవస్థ వాటా 34.6 బిలియన్ డాలర్స్ ఉండగా 2047 నాటికి 400 బిలియన్ డాలర్స్ విలువ చేరుతుందని మంత్రి తుమ్మల వివరించారు.
డిజిటల్ స్మార్ట్ దిశగా తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి తుమ్మల వెల్లడించారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్లోబల్ సమ్మిట్ రైతు రాజ్యం దిశగా బాటలు వేస్తుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో మెస్సర్స్ టిఎస్ఐఐసి లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ పురోగతి పై మంత్రి తుమ్మలకు వివరించారు. మెస్సర్స్ గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ నర్సరీ, ఆర్ అండ్ డి సెంటర్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, సమాధాన్ సెంటర్ మరియు సీడ్ గార్డెన్తో పాటు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కంపెనీ ఖమ్మంలో 116 ఎకరాల భూమిని సేకరించింది.
ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ విషయానికొస్తే, సీడ్ గార్డెన్ కోసం మరో 40 ఎకరాల భూమి అవసరం, వివిధ పనులకు భూమిని కేటాయించిన తర్వాత మాత్రమే వారికి 9 – 10 ఎకరాల భూమి మిగిలి ఉంది. కొన్ని స్థానిక సమస్యల కారణంగా భూమిని కలిగి ఉన్న రైతుల నుండి అవసరానికి అనుగుణంగా భూమిని సేకరించలేకపోయామనీ మంత్రి తుమ్మల కు తెలిపారు. ఖమ్మంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు, నర్సరీ, పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ మరియు సీడ్ గార్డెన్ స్థాపన పనుల స్థితిని M/s.Godrej Agrovet Limited ద్వారా అందించబడింది.
ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు: ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు నిర్మాణం ప్రస్తుతం 116 ఎకరాల భూమిలో జరుగుతోంది. అధిక సామర్థ్యం మరియు నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడానికి అధునాతన ప్రాసెసింగ్ సాంకేతికతలను చేర్చడానికి ఈ సౌకర్యం రూపొందించబడింది. ఇది మా value addition వ్యూహంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.