– గుజరాత్ లో ఇచ్చేది ఆరు గంటలే
– బుడ్డర్ ఖాన్ నోటి వెంట మూడు గంటల విద్యుత్
– ఉత్తర ప్రదేశ్ లో కరెంట్ లేని గ్రామాలు కోకొల్లలు
– కాంగ్రెస్ పార్టీ వస్తే కోతలు…వాతలే
– ఏ ఐ సి సి నిర్ణయాన్నే బుడ్డర్ ఖాన్ లు,పేపర్ పులులు బహిర్గతం చేశారు
– ఎనిమిది గంటల విద్యుత్ సరఫరానే కాంగ్రెస్ రహస్య ఎజెండా
– 24 గంటల విద్యుత్ విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదు.
– అదే నిజం అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదు
– అది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండానే
– 2014 లో గులాబీ జెండాను ఎత్తుకోక పోతే ఇక్కడ అదే పరిస్థితి
– పేపర్ పులి నోటివెంట సంక్షేమ పథకాలు ఎత్తివేత ప్రకటన
– జరగకూడనిది జరిగితే ఫించన్ 200 కు కుదింపు,కల్యాణలక్ష్మి/షాది ముబారక్ లకు మంగళం, రైతుబందు, రైతుభీమా ఎత్తివేతకు ఏ ఐ సి సి గ్రీన్ సిగ్నల్
– బూతులతో అబద్దాలు కప్పిపుచ్చుకుంటున్న బుడ్ధర్ ఖాన్
– అన్నము పెట్టె రైతుకు సున్నం పెట్టే కుట్రలు
– జరుగుతున్న అభివృద్ధి కొనసాగింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం
– పిసిసి నేత రేవంత్ రెడ్డి పై మంత్రి జగదీష్ రెడ్ది మండిపాటు
కాంగ్రెస్ పార్టీ అంటూ అధికారంలోకి వస్తే కోతలు…వాతలే నని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండానే బుడ్డర్ ఖాన్,పేపర్ పులి నోటి నుండి బహిర్గతం అయ్యాయని ఆయన చెప్పారు.ఎనిమిది గంటల విద్యుత్ కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండాలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ పిసిసి నేత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని శ్రీనివాసపురం రైతువేదికలో జరిగిన రైతుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్ పి టి సి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి కన్వినర్ కట్టా సతీష్ స్థానిక సర్పంచ్ రమ్యా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ సరఫరా అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదని ఆయన తేల్చిచెప్పారు.
అదీ నిజమే అయినప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు పరచడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి నిలదీశారు. ఛత్తీస్ ఘడ్ లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కేవలం ఏడూ గంటలు మాత్రమే నన్నారు.పైగా అక్కడి ప్రభుత్వం విద్యుత్ ను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి మూడు గంటల నుండి ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా అనేది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఎజెండాయో నని ఆయన తెలిపారు.
ఆ ఎజెండాయో బుడ్డర్ ఖాన్ నోటి నుండి బయటకు వచ్చిందన్నారు.అదే పార్టీకీ చెందిన పేపర్ పులి నోటినుండి ఉచిత విద్యుత్ కొన సాగిస్తామని అయితే సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని అన్న మాటలు కుడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రూపొందించుకున్న రహస్య ఎజెండాలోనేవేనన్నారు.
అదే నిజం అయితే ఫించన్ లను మళ్ళీ 200 లకు కుదించి కళ్యాణలక్ష్మీ/షాది ముబారక్ లకు మంగళం పాడి రైతు బంధు ,రైతు బీమా పధకాలు ఎత్తివేసినట్లే నని ఆయన ప్రజలను హెచ్చరించారు.
బూతులతో బుడ్డర్ ఖాన్ తాను మాట్లాడిన మాటలను కప్పి పుచ్చుకుంటూ అబద్దాలు చెబుతున్నారన్నారు.అన్నం పెట్టిన రైతులకు సున్నం పెట్టె కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపిందని ఆయన ఆరోపించారు. జరుగుతున్న అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ఆయన చెప్పారు.