Suryaa.co.in

Andhra Pradesh

రూ.10,77,006కోట్ల రాష్ట్ర అప్పుల వివరాలు బుగ్గన ఏం సమాధానం చెబుతాడు?

• ఏపీ అప్పులపై టీడీపీ చెప్పింది అక్షరసత్యం
• రాష్ట్ర అప్పు రూ.10లక్షలకోట్లు దాటిందని టీడీపీ ఎప్పటి నుంచో చెబుతున్న విషయం మరోసారి నిజమని తేటతెల్లమైంది
• జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నాలుగేళ్లలో అక్షరాలా రూ.7,14,631 కోట్ల అప్పులు చేశారన్న రాష్ట్ర బీజేపీ ప్రకటన, టీడీపీ వాదనకు బలంచేకూర్చింది
• జగన్ రెడ్డి చేసిన అప్పుల్లో రూ.4,74,315కోట్లు దొడ్డిదారిలో కార్పొరేషన్లు, తదితర సంస్థల పేరుతో అనధికారికంగా తీసుకొచ్చినట్టు తేలింది
• అడ్డగోలుగా అయికాడికి అప్పులు తేవడం, ఆ సొమ్ముని దిగమింగడం. ఇదీ జగన్ రెడ్డి అతనిప్రభుత్వం సాధించిన ప్రగతి
• ఏపీ బీజేపీ విడుదలచేసిన అప్పుల సమాచారం తప్పని రుజువుచేసే దమ్ము జగన్ సర్కార్ కు ఉందా?
• ఏపీ ప్రభుత్వ అప్పులపై టీడీపీ ఆధారాలతో సహా ఎప్పుడుమాట్లాడినా కల్లబొల్లిమాటలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించే జగన్ సర్కార్ ఇప్పుడేం సమాధానం చెబుతుంది?
• బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఫైనాన్స్ మేనేజర్ కాదని, రాష్ట్ర ఆర్థికమంత్రనే విషయం గుర్తుంచుకోవాలి
• గుడివాడ అమర్నాథ్ అప్పుల లెక్కలపై తప్పుడుమాటలు మాట్లాడుతున్నాడు. గతంలో అతని కోడిగుడ్డు ప్రవచనాలు విన్నప్పుడే అతని మేథస్సు బలమెంతో ప్రజలకు బాగా అర్థమైంది
• జగన్ కు అవినీతి సొమ్ము పంపకాల లెక్కలు వివరించడంలో క్షణం తీరిక లేకుండా గడిపేబుగ్గన, రూ.10,77,006 కోట్ల అప్పులెక్కల్లోని గుట్టు తక్షణమే ప్రజలకు తెలియచేయాలి
• ముఖ్యమంత్రి ఏరికోరి నియమించిన ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణగారు, నేడు మళ్లీ ఏ తప్పుడులెక్కలతో ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తారో చూస్తాం
• ఏపీప్రభుత్వం అడ్డగోలు అప్పులు, అవినీతిపై నేడు మాట్లాడుతున్న బీజేపీ, వారిసారథ్యంలో నడుస్తున్న కేంద్రప్రభుత్వం ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

రాష్ట్రంలో ఆర్థిక అత్యవసరపరిస్థితి నెలకొన్నదని, దానికి కారణం జగన్మోహన్ రెడ్డేనని ఆధారాలతో కూడిన వివరాల్ని ఎప్పుడు ప్రజలముందు ఉంచినా, ప్రభుత్వపెద్దలు బుకాయిస్తూ తప్పించుకుంటున్నారని, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఆర్థికరంగనిపుణుడు దువ్వూరి కృష్ణ, మరికొందరు ప్రముఖులు అబద్ధాలు, అసత్యాలతో కాలయాపనచేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే….

“ రాష్ట్ర అప్పు రూ.10లక్షలకోట్లు దాటిందని టీడీపీ ఎప్పటినుంచో చెబుతున్న విషయం నిజమని మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్రఅప్పు రూ.10లక్షలకోట్లు దాటి పోయిందనే పచ్చినిజాన్ని కప్పిపుచ్చుతున్నారు. రాష్ట్ర బీజేపీ విభాగం 2019నుంచి 2023 జూలై 18వరకు రాష్ట్రప్రభుత్వం ఏఏ మార్గాలద్వారా ఎంతఅప్పులు తీసుకొచ్చిం దనే వివరాలు బయటపెట్టింది. జూలై18 నాటికి మనరాష్ట్రం అప్పు రూ.10,77, 006కోట్లు అని బీజేపీచెప్పింది. ఇదేఅంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సహా, మా పార్టీనేతలందరూ పదేపదే పలుసందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని తప్పించుకుంటున్న ఆర్థికమంత్రి బుగ్గన, రాష్ట్రబీజేపీశాఖ చెప్పిన వివరాలపై ఏం సమా ధానం చెబుతారు?

నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా రూ.10,77,006 కోట్లు అని కేంద్ర ఆర్థికశాఖ ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర బీజేపీ తేల్చింది
బీజేపీ చెప్పినవివరాల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేనాటికి 2019లో రాష్ట్రం మొత్తం అప్పు రూ.3,62,375కోట్లు అని ఉంది. ఈ మొత్తంఅప్పులో 2014కి ముందు న్న అప్పుని కూడా జతచేయడం జరిగింది. టీడీపీప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.3,62,375కోట్లు అయితే, జగన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అప్పుకలిపి మొత్తం రూ.10,77,006కోట్లకుచేరింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేసిన అప్పు రూ. 7,14,631కోట్లు. ఈ మొత్తం అప్పు జగన్ ఏఏమార్గాల్లో ఎలా తీసు కొచ్చాడనే వివరాల్ని కూడా బీజేపీ రాష్ట్రవిభాగం బయటపెట్టింది. ఈ అప్పుల్లో జగన్ అధికారికంగా, అనధికారికంగా చేసిన అప్పులవివరాలు కూడా తెలియచేశారు.

అధికారికంగా.. అనధికారికంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అడ్డదారుల్లో అడ్డగోలుగా తీసుకొచ్చిన అప్పుల వివరాలు
అధికారికంగా ఆర్.బీ.ఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా) ద్వారా చేసిన అప్పు కేవలం రూ.2,39,716 కోట్లు. అనధికారికంగా దొడ్డిదారిన చట్టాలను ఉల్లంఘించి తీసుకున్న అప్పు రూ.4,74,315కోట్లు. దానిలో వివిధకార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పు రూ. 98,603కోట్లు అని, రాష్ట్రప్రభుత్వ ఆస్తులు తనఖాపెట్టి తీసుకున్న అప్పు రూ.94,928 కోట్లుఅని, మారిటైమ్ బోర్డు ద్వారాతీసుకున్న అప్పు రూ.5వేలకోట్లు అయితే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పు రూ.35 వేలకోట్లు అని, రాష్ట్రంలోని విద్యుత్ డిస్కంల పేరుతో తీసుకున్న అప్పు రూ.27,384 కోట్లుఅని, లిక్కర్ బాండ్స్ ద్వారా గతంలో తీసుకున్న అప్పు రూ.8,305కోట్లు, అని ఎక్కడెక్కడనుంచి ఈ ప్రభుత్వం ఎంతెంత అప్పులు తీసుకుందనే వివరాల్ని అంకెలతో సహా స్పష్టం చేశారు.

రాష్ట్ర బీజేపీ శాఖ ఈ వివరాలన్నీ ఇంత కచ్చితంగా అంకెలతో సహా చెప్పిందంటే, కేంద్ర ఆర్థికశాఖ, అంకెలతో సహా సమాచారం ఇవ్వబట్టే. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరాలనే రాష్ట్ర బీజేపీశాఖ విడుదలచేసిందని అనుకోవాలి. ఏఏ మార్గాల్లో ఎంతెంత అప్పులు జగన్ రెడ్డి తీసుకొచ్చారనే వివరాలతోపాటు, ప్రజలకు ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థలకు, కాంట్రాక్టర్లకు ఎంతెంత చెల్లించకుండా, ఎన్నినిధుల్ని దారిమళ్లించారనే వివరాలుకూడా ఉన్నాయి.

పంచాయతీలకు చెందాల్సిన కేంద్రప్రభుత్వ, వివిధ ఆర్థిక సంఘాల నిధుల్ని పక్కదారి పట్టించి తీసుకున్న అప్పులు రూ.8,868కోట్లు అయితే, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సింది రూ.33,100కోట్లు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సొమ్ము రూ.71,500కోట్లు అని వెల్లడించారు. ఈ అంకెలన్నీ గతంలో తె లుగుదేశం పార్టీ చెప్పిన అప్పులవివరాలు నిజమని నిరూపించడానికి సరిపోయేలా ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ విభాగం బయటపెట్టిన అప్పులలెక్కలపై జగన్మోహన్ రెడ్డి, ఆర్థి కమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దువ్వూరి కృష్ణ ఏం సమాధానంచెబుతారు?

రాష్ట్ర బీజేపీ విభాగం బయటపెట్టిన ఏపీ అప్పుల వివరాలపై ఆర్థికమంత్రి బుగ్గన తక్షణమే నోరు విప్పాలి
రాష్ట్ర బీజేపీ విభాగం చెప్పిన అప్పులవివరాలన్నీ తప్పుని, కేంద్రఆర్థికశాఖ అబద్ధాలు చెప్పిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిరూపించగలడా? గతంలో టీడీపీ చెప్పిన అప్పు ల లెక్కలన్నీ కూడా కాగ్ వంటిసంస్థలద్వారా బయటకొచ్చిన వివరాలే. అయినాకూ డా ప్రధానప్రతిపక్షంపై బురదజల్లి, ప్రజల్ని మభ్యపెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిం చారు. గతంలో టీడీపీ చెప్పిన లెక్కల్నే, ఇప్పుడు రాష్ట్ర బీజేపీవిభాగం బయటపెట్టింది. రాష్ట్ర అప్పులకు సంబంధించి బీజేపీ బయటపెట్టిన వివరాలపై ఆర్థికమంత్రి బుగ్గన ఏం సమాధానంచెబుతాడని నిలదీస్తున్నాం.

పిట్టకథలుచెప్పి తప్పించుకుంటాడో, వాస్తవా లు ఒప్పుకుంటాడో చూస్తాం. రాష్ట్రఅప్పులపై కోడిగుడ్ల మంత్రి అమర్నాథ్ స్పందించ డం విడ్డూరంగా ఉంది. అమర్నాథ్ ఎంతమేథావో, ఆయన కోడిగుడ్లపై ప్రవచనాలు చె ప్పినప్పుడే అర్థమైంది. అప్పులలెక్కలు చెప్పడమంటే కోడిగుడ్లపై ఈకలు పీకినంత తేలికకాదని తెలుసుకో అమర్నాథ్.

రూ.10,77,006 కోట్ల అప్పు ఎవరుకట్టాలి? అంది నచోటల్లా వేలు, లక్షలకోట్ల అప్పులు తెచ్చి, రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధిచేశారా అంటే అదీలేదు. ప్రజలకు అవసరమైన కనీసమౌలిక వసతులు రోడ్లు, తాగునీరు, వైద్యం వం టి వాటిని కూడా అందించలేకపోయారని తేలిపోయింది.

అప్పుల్లో అగ్రస్థానం కేపిటల్ ఎక్స్ పెండేచర్ లో దేశంలో 25వస్థానం.. ఇదీ జగన్ రెడ్డి సాధించిన ప్రగతి
ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడావారు ఒకనివేదిక విడుదలచేశారు. కేపిటల్ ఎక్స్ పెండేచర్ (మౌలిక సదుపాయాల కల్పనకోసం చేసే ఖర్చు) లో ఏపీ దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచిందని సదరు నివేదికలో పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటివాటి కల్పనలో జగనన్న ప్రభుత్వం దేశంలోనే 25వ స్థానంలో నిలిచిందని సదరు నివేదిక బయటపెట్టింది. మౌలిక సదు పాయాలు కల్పించకుండా, సంక్షేమపథకాలకు కోతలుపెట్టి, అప్పు లు తెచ్చిన సొమ్మంతా జగన్ అండ్ కో నే దిగమిం గారు.

ఏపీ ప్రభుత్వ అప్పుల వివరాల్ని బయటపెట్టిన కేంద్రం, అడ్డగోలుగా అప్పులు తెస్తున్న జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని కట్టడిచేయడంలో ఎందుకు మెతకవైఖరి అవలంభిస్తోంది
ఏపీప్రభుత్వం అడ్డగోలుగా చేసినఅప్పులపై కేంద్రప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. గతేడాది జూలైలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రాష్ట ప్రభుత్వాలు వివిధమార్గాల్లో తీసుకొచ్చే అప్పుల్ని ఎఫ్.ఆర్.బీ.ఎం లిమిట్ కు లోబడే పరిగణి స్తామనిచెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్.ఆర్.బీ.ఎం లిమిట్ (నెట్ బారోయింగ్ సీలింగ్) రూ.30,275కోట్లు అయితే, దానిలో ఇప్పటికే రూ.28,500 కోట్లను వైసీపీప్రభుత్వం వాడేసింది.

ఇక ఈ ప్రభుత్వానికి మిగిలిన అప్పుల పరిమితి కేవలం రూ.1800కోట్లు మాత్రమే, ఆ కొద్దిపాటి సొమ్ముతో ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలినసమయాన్ని ఈ ప్రభుత్వం ఎలానెట్టుకొస్తుంది? ఎలాగ య్యా అంటే జగన్ రెడ్డి చావుతెలివితేటలతో. దొంగమార్గాలు.. దొడ్డిదారుల్లో అప్పులు తీసుకురావడం.. వాటిని తనఖజానాలో వేసుకోవడం జగన్ రెడ్డికి చేతనైందే కదా! ఈ ఏప్రియల్ లోనే వివిధ కార్పొరేషన్లద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.17, 456కోట్ల అప్పులు తీసుకొచ్చిందని సీఏజీ (కాగ్) నివేదికలు చెబుతున్నాయి.

జగన్ ప్రభుత్వం చేసిన అప్పులవివరాలు బయటపెట్టిన కేంద్రప్రభుత్వం, దొడ్డిదారిన తీసుకొచ్చే అప్పులపై ఎందుకుచర్యలు తీసుకోవడంలేదు? జగన్ తన ధనదాహం తీర్చుకోవడానికి ఏపీని, ప్రజల్నితాకట్టుపెట్టి అప్పులు తీసు కొస్తుంటే, కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోకుంటేఎలా? కేరళప్రభుత్వం కే.ఐ.ఐ .ఎఫ్.బీ (కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు) ద్వారా అదనంగా అప్పులు తెచ్చిందన్నసాకుతో కేరళవంటి చిన్న రాష్ట్రానికి రూ.13,177కోట్ల బారోయింగ్ లిమిట్ (ఎఫ్.బీ.ఆర్.ఎం లిమిట్) తగ్గించిన కేంద్రప్రభుత్వం, ఏపీ విషయంలో ఎందుకు మెతకవైఖరి అవలంభిస్తోంది?

ఇప్పటికే అప్పులఊబిలో కూరుకు పోయిన రాష్ట్రం మరింత మునిగిపోయేవరకు కేంద్రప్రభుత్వం స్పందించదా? రాష్ట్రాన్ని, ఏపీప్రజల భవిష్యత్ ను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? అప్పుల వివరాల వెల్లడితో ఊరుకోకుండా కేంద్రప్రభుత్వం తక్షణమే ఏపీప్రభుత్వ అడ్డగోలు అప్పులపై దృష్టిపెట్టి, కఠినచర్యలు తీసుకోవాలి.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఫైనాన్స్ మేనేజర్ కాదని, రాష్ట్ర ఆర్థికమంత్రనే విషయం గుర్తుంచుకోవాలి
నిత్యం జగన్ రెడ్డి రాష్ట్రంలో వివిధమార్గాల ద్వారా దోచుకుంటున్న సొమ్ముకి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ కి లెక్కలు అప్పచెప్పడంలో తీరికలేకుండా గడిపే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను ముఖ్యమంత్రికి వ్యక్తిగత ఫైనాన్స్ మేనేజర్ కాదని, రాష్ట్ర ఆర్థికమంత్రి అనే విషయం గుర్తించాలి. నేటివరకు పేరుకుపోయిన రూ.10,77,006 కోట్ల అప్పులెక్కలను తక్షణమే బుగ్గన ప్రజలకు వివరించాలి. కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలుపెట్టి మరీ అప్పులసొమ్ముని ఎటుమళ్లించారో, తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్నిలక్షలకోట్లు దాచారో మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలి.

మంత్రి పెద్దిరెడ్డి లాంటి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్న జగన్ రెడ్డి, అప్పులుచేసి పనులు చేసిన చిన్నాచితకా కాంట్రాక్టర్లకే రూ.70వేల కోట్లవరకు బాకీ పెట్టడం ఎంతవరకు సరైంది? ఆ సొమ్మంతా చెల్లించకుంటే రాష్ట్రంలో పనులు చేయడానికి ఎవరూముందుకొస్తారు? రోడ్లగుంతలు పూడ్చ డానికి కూడా ఎవరూ రావడంలేదంటే ఎందుకొస్తారు? ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దువ్వూరి కృష్ణ తక్షణమే ఏపీ బీజేపీ బయటపెట్టిన అప్పుల వివరాలపై సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి చేస్తున్న అడ్డగోలుఅప్పులు, జనాన్ని దోచుకోవడానికి వేస్తు న్న పన్నులపై ఆలోచించాలి. చంద్రబాబుహయాంలో రాష్ట్రానికి అప్పులు తక్కువ… అభివృద్ధి ఎక్కువ. జగన్ రెడ్డి పాలనలో అప్పులు ఎక్కువ.. పన్నులబాదుడు ఎక్కువ.. ప్రజలకు అవసరమైన వసతులు, సౌకర్యాలు, రాష్ట్రాభివృద్ధి తక్కువ. ఈ వ్యత్యా సాన్ని ప్రజలందరూ గమనించాలి.” అని పట్టాభి రామ్ సూచించారు.

LEAVE A RESPONSE