– 50 శాతం సీట్లను డొనేషన్ కోటాలో అమ్మాలన్న నిర్ణయం దళిత, బడుగుబలహీన వర్గాల విద్యార్థులకు వైద్యవిద్యను, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దూరంచేయడమే.
• ఎం.బీ.బీ.ఎస్ సీట్లు అమ్మకంకోసం తీసుకొచ్చిన 107,108జీవోలను జగన్ తక్షణమే రద్దుచేయాలి.
• పేదలపక్షపాతిని అని చెప్పే జగన్, పేద, మధ్యతరగతి విద్యార్థులు లక్షలుపోసి ఎం.బీ.బీ.ఎస్ సీట్లు ఎలా కొంటారో ఎందుకు ఆలోచించడు?
• ప్రభుత్వ కళాశాలల్లోని ఎం.బీ.బీ.ఎస్ సీట్లు అమ్ముకుంటే, భవిష్యత్ లో ఎలాంటివారు డాక్టర్లు అవుతారో, పేదలకు ఎలాంటి వైద్యసేవలు అందుతాయో జగన్ కు తెలియదా?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్
గొప్ప సంస్కరణలతో విద్యారంగాన్ని ఉద్ధరించామని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి, రాష్ట్రంలో వైద్యవిద్యకు గ్రహణం పట్టించడానికి సిద్ధమయ్యాడని, మెడికల్ సీట్లను అమ్ముకోవడానికి కొత్తఆలోచనలు చేస్తున్నాడని, ప్రభుత్వ కళాశాలల్లోని మెడికల్ సీట్ల ను సొమ్ముచేసుకోవాలనుకుంటున్న పాలకులు దుష్టఆలోచనతో పేద, మధ్య తరగతి వైద్యవిద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి నసీర్ అహ్మద్ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని సీట్లు అమ్ముకోవడానికి జగన్ రెడ్డి సిద్ధమవ్వడం సిగ్గుచేటు. నాఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని మాయమా టలతో ఆయావర్గాలను వంచిస్తున్న జగన్ రెడ్డి, ఆయావర్గాల యువతకు శాశ్వతంగా వైద్యవిద్యను దూరంచేసేలా కుట్రలకు తెరలేపాడు. రాష్ట్రానికి ఈ విద్యాసంవత్సరం కొత్తగా 750 ఎమ్.బీ.బీ.ఎస్ సీట్లు వచ్చాయి. వాటిద్వారా పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయి.. పేద, మధ్యతరగతి విద్యార్థులు తక్కువఖర్చుతో ఎం.బీ.బీ.ఎస్ పూర్తిచేయవచ్చని ప్రజలు అనుకుంటున్న తరుణంలో జగన్ రెడ్డి ఎం.బీ.బీ.ఎస్ సీట్లు అమ్ముకోవడానికి సిద్ధమవ్వడం దుర్మార్గం.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మెడికల్ సీట్లను అమ్ముకోవడానికే, ముఖ్యమంత్రి జీవోలు 107, 108 తీసుకొచ్చాడు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 100సీట్లు ఉంటే, వాటిలో 15శాతం సీట్లు కేంద్రప్రభుత్వం ఆలిండియా కోటాకింద భర్తీచేసుకుంటే, మిగిలిన 85శాతం సీట్లలో 50శాతం కన్వీనర్ కోటా, మిగిలిన 35శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూపుకిందకు చేర్చి, వాటిలో20శాతం సీట్లు అమ్ముకునేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
చరిత్రలో ఎక్కడా, ఎన్నడూలేనివిధంగా ప్రభుత్వ వైద్య కళాశాల ల్లో 15శాతంసీట్లను ఎన్.ఆర్.ఐకోటా కిందకు చేర్చారు. దీనివెనకున్న ఆంతర్య మేంటో ప్రభుత్వమేచెప్పాలి. ప్రభుత్వసహాకారంతో వైద్యవిద్యను అభ్యసించాలను కునే పేద, మధ్యతరగతి విద్యార్థులనోట్లో మట్టికొట్టి, డబ్బున్న వారికే వైద్యవిద్య అనేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధాకరం. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని, అంతర్జాతీ యస్థాయిలో కొత్తమెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నామని చెబుతున్న జగన్ రెడ్డి, నాలుగున్న రేళ్లలో ఎందుకు మెడికల్ సీట్లు పెంచలేకపోయాడో సమాధానం చెప్పాలి.
తెలంగా ణకు ఈ ఏడాది 900 మెడికల్ సీట్లువస్తే, ఏపీకి 750 సీట్లేరావడం ముఖ్యమంత్రి అసమర్థతకాదా? రాష్ట్రానికి వచ్చిందే తక్కువసీట్లు అయితే, వాటిలో 50శాతం సీట్లు అమ్ముకోవడానికి సిద్ధమవ్వడం దారుణం. తమపిల్లల్ని డాక్టర్లను చేయాల ని కలలుగంటున్న పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లుచల్లేలా జగన్ రెడ్డి జీవో ఉంది. 750 మెడికల్ సీట్లలో 112సీట్లు ఆలిండియా కోటాకింద కేంద్ర ప్రభుత్వానికి పోతే, మిగిలిన వాటిలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు దక్కేవిఎన్ని?
తెలంగాణ ప్రభుత్వం ఒక్కసీటుని కూడా ఎన్.ఆర్.ఐ, కన్వీనర్ కోటా కిందచేర్చకపోతే, ఏపీప్రభుత్వం అనాలోచితంగా ఎం.బీ.బీ.ఎస్ సీట్లు అమ్ముకోవడానికి సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటికే నాణ్యమైన వైద్యం అందక ప్రజలు నానాఅవస్థలు పడుతుంటే, ప్రభుత్వం వైద్యవిద్యసీట్లు అమ్ముకోవాలని చూడటం మొత్తం వైద్యవ్యవస్థనే దిగజార్చడం కాదా?
కరోనాసమయంలో రాష్ట్ర మంత్రులే ప్రాణభయంతో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైనగరాల్లో వైద్యసేవలు పొందారు. ఆక్సిజన్ అందక ప్రజలప్రాణాలు పోయినా కూడా జగన్ రెడ్డి, తన ధనదాహాన్ని తీర్చుకోవడా నికే ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటు.
గతంలో ఎన్టీఆర్ పేద లకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి అనేక గొప్పనిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఒక ఆరోగ్యవిశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి, రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటినీ దానిపరిధిలోకి తీసుకొచ్చి కళాశాలయాజమాన్యాలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా, పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.
వైద్యవృత్తివిద్యాభ్యాసాన్ని పేదలకు అందు బాటులోకి తీసుకొచ్చి, రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన వైద్యం అందించేలా జగన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు, పేదలద్రోహి అనడానికి అతను తీసుకొచ్చిన జీవోలు 107, 108 లే నిదర్శనం.” అని నసీర్ అహ్మద్ స్పష్టంచేశారు.