– లక్షలాది దొంగ ఓట్లను చేర్చుతూ జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు
ఎన్నికల ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చారు
– అధికార పార్టీ దొంగ ఓట్లు నమోదుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పిర్యాదు చేసిన తెదేపా నేత వర్ల
– తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో ఎన్నికల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఎన్నికలన్ని దొంగ ఓట్లతో, బూతులను హస్తగతం చేసుకుని సొంత మనుషులైన వాలంటీర్ల సంపూర్ణ సహకారంతో, పోలీసు అధికారుల మద్దతుతో అన్ని ఎన్నికల్లో గెలవాలని ముఖ్యమంత్రి తాపత్రయం. పంచాయతీ ఎన్నికల్ల్లో, ఉపఎన్నికల్లో భారీ స్థాయిలో దొంగ ఓట్లు చేర్పించి తద్వారా గెలిచిన ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. ప్రజాస్వమ్య విలువలు కాలరాచారు. డా.బి.ఆర్. అంబేడ్కర్ విరచిత భారత రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు.
దొంగ ఓట్లతో, బూత్ రిగ్గింగ్ లతో, అధికారుల అండదండలతో, వాలంటీర్ల ఆగడాలతో జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దమయ్యారు. ప్రాణ్యంలో 125 బూత్ లలో ఒక ఇంటిలో 756 ఓట్లు , ఆదోని 223 బూత్ లో 209 ఓట్లు, మరో ఇంట్లో 709 ఓట్లు ఉన్నాయి. ఒక్క ఇంటిలో ఎక్కడైనా 756 మంది ఓటర్లు ఉంటారా? 700 ఓటర్లు ఒక కుటుంబంలో ఉండాలంటే ఆ ఇంట్లో కనీసం 1500 మంది సభ్యులైనా ఉండాలి.
ఎన్నికల ప్రక్రియ పార్స్ గా మారిందని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం గతంలో చెప్పాం. అందుకే కలెక్టర్, ఎస్పీలకు వార్నింగ్ ఇచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ని సస్సెండ్ చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా నడవాల్సిన ప్రక్రియను ఇస్టానుసారంగా నడిపిస్తామంటే కుదరదు. కుటుంబంలోని అన్ని ఓట్లు ఒకే బూత్ లో ఉండాలి. ఓటర్ వెరిఫికేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఎన్నికల వెరిఫికేషన్ కు ఎన్నికల అధికారులు వెళ్లే ముందు విస్తృత ప్రచారం చేయాలని కోరాం.
వాలంటీర్ అనే వ్యక్తి ఎన్నికల ప్రక్రియ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని ఈసీకి చెప్పాం. సచివాలయ వ్యవస్థలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మహిళా పోలీసులు కూడా ఎన్నికల ప్రక్రియలో తలదూర్చకూడద చెప్పాం. అలా కాదని ఎన్నికల పక్రియలో తలదూర్చితే వారిని సస్సెండ్ చేయాలని కోరాం.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా ఏర్పాటుచేసిన సమావేశంలో తెదేపా తరపున పాల్గొన్న రామయ్య తాము ప్రతిపాధించిన అంశాలపై ఈసీ సానుకూలంగా స్పందించిందని తెలిపారు.