– తెలంగాణ ప్రజలకు బిజెపి ఎంపి తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలి
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేక మంది త్యాగాలు, కోట్లాడి సాధించడం జరిగింది. ఎవరి దయతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. పార్లమెంట్ సాక్షిగా ఒక బిజెపి ఎంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చడం మన రాష్ట్ర ప్రజలందరిని అగౌరవ పరచడమే. తేజస్వి సూర్య నిండు సభలో మాట్లాడుతున్న ఖండించకుండా కూర్చున్న తెలంగాణ బిజెపి, కాంగ్రెస్ ఎంపిల తిరు సిగ్గుచెట్టు.
బీజేపీ నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మిగిలిన 6 మంది బిజెపి ఎంపి లు తెలంగాణ ప్రజలకు అయినా వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ఎవరు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ప్రజలు సహించబోరు. తెలంగాణ ఏర్పాటుపై బిజెపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. తక్షణమే తేజస్వి సూర్య తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి.