Suryaa.co.in

Crime News National

అహ్మదాబాద్‌ బాంబు పేలుళ్ల కేసు:38మందికి మరణశిక్ష

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులకు శిక్ష ఖరారైంది. 49మంది నిందితుల్లో 38మందికి మరణశిక్ష, 11మందికి జీవిత ఖైదు విధిస్తూ..ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 77మంది నిందితులపై విచారణ జరిపింది. 2008 జులై 26న అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం), హర్ఖత్ ఉల్ జిహాదీ ఆల్ ఇస్లామీ తీవ్రవాద సంస్థలే ఈ పేలుళ్లకు కారణమని తేల్చారు.

LEAVE A RESPONSE